పునర్జన్మ అనేది వాస్తవమేనా?

పునర్జన్మ అనేది వాస్తవమేనా?

మనమందరం మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్న ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం. మన స్వభావ-సంస్కారాలు, మన ప్రవర్తన ఆధారంగా మనల్ని మనం ఆధ్యాత్మికంగా అనుభూతి చేసుకుంటాము. పునర్జన్మల చక్రంలోకి వస్తాము అనేది సాధారణంగా అంగీకరించబడిన వాస్తవం. అలాగే, పునర్జన్మను విశ్వసించని, కల్పితమని,  జీవితం కేవలం భౌతికమని, అన్ని ఆలోచనలు ఆలోచించేది, విజువలైజ్  చేసేది ఆత్మ కాదు మెదడని నమ్మే వ్యక్తులూ ఉన్నారు. స్వభావ- సంస్కారాలు ఆత్మలో ఉండవు, తల్లిదండ్రుల నుండి సంక్రమించిన భౌతిక జన్యువులు తప్ప మరేమీ కాదని వారు నమ్ముతారు.

భగవంతుడు కూడా మనలాంటి ఆధ్యాత్మిక శక్తి అని మరియు వారు జనన-మరణ చక్రంలోకి రారని  ఆధ్యాత్మికత మనకు చెప్తుంది. వారు నిరంతరం ఆత్మల ప్రపంచంలో ఉంటారని, మనుష్యులు తమ ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి, గుణాలలో క్షీణించినప్పుడు మాత్రమే భూమిపైకి వస్తారు. భగవంతుడు భూమిపైన ఉన్న  ఆత్మలను  తన ఆధ్యాత్మిక గుణాలతో నింపి ప్రపంచాన్ని మళ్లీ ఉద్ధరిస్తారు. వారు కలియుగాన్ని సత్య యుగంగా  మారుస్తారు, దీనిని స్వర్గం అని కూడా పిలుస్తారు. భగవంతుడు భూమిపైకి వచ్చినప్పుడు,  పునర్జన్మల  జ్ఞానాన్ని ఇస్తారు.  సత్య యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు ఆత్మలైన మనము ఎలా వివిధ వస్త్రాల (శరీరాల) ద్వారా పాత్రలను అభినయిస్తాము, భగవంతుడు పవిత్రంగా చేసిన తరువాత మళ్ళీ మనం సత్య యుగానికి వెళ్లేదాని గురించి చెప్తారు. సత్య యుగం నుండి కలియుగం యొక్క ఈ చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »