Soul sustenence 28th june telugu

అహంకారాన్ని త్యాగం చేయటం (భాగం 3)

మనకు భిన్నంగా అనిపించినప్పటికీ ప్రతి సంబంధంలో ఇతరులను ముందుంచే వ్యక్తి సంబంధాన్ని ముందుకు నడిపించేవాడు అని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే ఒక విషయంలో కొన్ని సమయాల్లో మీరు అవతలి వ్యక్తి అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ అవతలి వ్యక్తికి అవును అని చెప్పడం. చాలా సార్లు కార్యాలయాల్లో మరియు ఇళ్లలో అందరూ సన్నిహితంగా కలిసి ఉండడం మీరు చూస్తారు, కొన్ని ఇతర స్థానాలలో తమ సంబంధాలను ఎలా కొనసాగిస్తునారు అన్న దానిని బట్టి నెగెటివ్ ఎనర్జీ మరియు నెగెటివ్ మాటలు మనకు కనిపిస్తాయి. ఇంకొక చోట, ఇద్దరు ఆఫీసు సహోద్యోగులు ఒకరితో ఒకరు మంచి బంధాన్ని కలిగి ఉంటారు, ఇక్కడ కార్యాలయంలో రోజు చాలా సాఫీగా సాగిపోతుంది మరియు వారు ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవపడరు. మరోవైపు, మరొక కార్యాలయంలో, ఇద్దరు వ్యక్తులు ఒకరితో కలసి ఒకరు పనిచేయలేరు. దీనికి ప్రధాన కారణం చాలా – నేను మీ కంటే తెలివైనవాడిని లేదా నేను చాలా సమర్థుడిని లేదా నేను మీ కంటే కష్టపడి పని చేస్తున్నాను లేదా నేను చాలా తెలివైనవాడిని అని అనుకోవడం. అలాంటి ఆలోచనలు సంబంధాన్ని పాడు చేసి ప్రేమ మరియు సాన్నిహిత్యంతో కూడిన అందమైన బంధంగా మారనివ్వవు.

విభేదాలు మరచి స్నేహం చేయండి అని చెప్పబడుతుంది. కానీ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సరిగ్గా ఒకే అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉండరు. అయితే ఈ తేడాలు మర్చిపోవాలి. మరో మాటలో చెప్పాలంటే, వాటిని పరిష్కరించుకోవాలి. అదే విజయానికి కీలకం. కార్యాలయంలో విజయం అనేది మీ ప్రతిభను బట్టి, మీరు ఎంత బాగా పని చేస్తున్నారో బట్టి మాత్రమే కాకుండా మీరు మీ సంబంధాలను ఎంత చక్కగా ఉంచుకుంటున్నారు లేదా మీరు ఎంత మధురంగా మరియు వినయంగా ఉన్నారనే దాని ద్వారా కూడా కొలవబడుతుంది. అలాంటి వారిని కార్యాలయంలో ఎంతో గౌరవిస్తారు. అహంభావి,  తమ దృక్కోణాలలో చాలా దృఢంగా ఉండేవారు, అవసరమైన అహంకారాన్ని త్యాగం చేయలేని వారి కంటే మనుష్యులు ఇలాంటి  వారితో ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. జీవితం చిన్నదని గుర్తుంచుకోండి. కాబట్టి మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి, మీ ఆఫీసు సహోద్యోగి, మీ అత్తగారు, ఎవరితోనైనా ప్రతి రోజు ఎందుకు ఆనందింగా ఉండకూడదు. వారందరూ మీకు ముఖ్యమైనవారు  మరియు మీరు వారికి ముఖ్యం. కాబట్టి అహాన్ని త్యాగం చేసి అందరి ఆశీర్వాదాలను పొందండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »