28th march soul sustenance telugu

సంతుష్ట మణిగా ఉండటం (పార్ట్ 2)

కఠిన పరిస్థితి మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినపుడు లేదా నెగెటివ్  సంఘటన కారణంగా మీరు కొంత కలవరపడినపుడు  మానసికంగా మీకు మద్దతు ఇవ్వడానికి మీలో ఉన్న పాజిటివిటీ కోసం చూడండి. అలాగే, ప్రతిదానిలో మరియు ప్రతి ఒక్కరిలో మంచితనం కోసం వెతకండి, ఇది మిమ్మల్ని ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది. మన సంతృప్తి తగ్గడానికి ప్రధాన కారణం నెగిటివిటీతో మన మనస్సులను ప్రభావితం చేయడం.  కొన్నిసార్లు మరొక వ్యక్తి యొక్క బలహీనత లేదా ఒక నెగెటివ్ పరిస్థితి మనల్ని శాంతిగా ఉంచదు. అంతేకాక వారి పట్ల మన అవగాహన మరియు వైఖరి నెగెటివ్ గా మారవచ్చు. కాబట్టి, పాజిటివ్ విషయాలను వినడం ద్వారా లేదా పాజిటివ్ ఆధ్యాత్మిక మూలంతో అనుసంధానించడం ద్వారా నా మనస్సును పాజిటివ్ గా ఉంచుకోవడం నేర్చుకుంటే, నేను పరిస్థితులను నిర్లిప్తంగా ఎదుర్కోగలుగుతాను మరియు ప్రేక్షకుడిలా చూడగలుగుతాను.

సంతృప్తి అనేది చాలా ముఖ్యమైన గుణం మరియు అన్ని గుణాలకు తల్లి లాంటిది. సంతృప్తి ఉన్న చోట అన్ని ఇతర గుణాలు ఉంటాయి. ఉదాహరణకు సహనం యొక్క గుణాన్ని తీసుకోండి. సంతృప్తిగా ఉన్నవారు, పరిస్థితులు లేదా సంఘటనల సద్దుమనిగే వరకు వేచి ఉండగలరు  మరియు అసహనంగా ఉండరు. అలాగే ఓర్పు యొక్క గుణాన్ని తీసుకోండి. సంతృప్తిగా ఉండే వ్యక్తిలో  ఓర్పు సహజంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత నిండుగా మరియు సంపూర్ణంగా ఉంటారో మీ కోరికలు మరియు అంచనాల ప్రకారం వ్యక్తులు మరియు పరిస్థితులు లేకపోయినా మీరు అంత ఎక్కువగా స్పందించరు. అలాగే, మరొక ఉదా. వినయం. నేను ఎంత తృప్తిగా ఉన్నానో, నేను అహం నుండి అంత విముక్తియై ఉంటాను, ఎందుకంటే నేను ఆత్మగౌరవం అనే సింహాసనంపై స్థిరంగా మరియు దృఢంగా కూర్చున్నాను. ఆత్మగౌరవం నన్ను ఎలాంటి న్యూనత మరియు ఆధిక్యత భావాల నుండి విముక్తి చేస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »