మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత ఒక నిమిషం పాజ్ చేసి, మనసుకి విశ్రాంతిని ఇచ్చి కొన్ని శక్తివంతమైన ఆలోచనలతో దాన్ని ఛార్జ్ చేయవచ్చు. దాని వలన బాహ్య నెగెటివ్ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా, మనం మనసులో సరైన ఆలోచనలను ఆలోచించడానికి  ప్రయత్నం చేయవలసిన అవసరం  లేదు. మనస్సు స్వయంగా సరిగ్గా ఆలోచించడం ప్రారంభిస్తుంది. మీ మనస్సును రిఫ్రెష్ చేసేందుకు మీరు ఏమి చేస్తారు?  – వీకెండ్ వెకేషన్,  డిటాక్స్, షాపింగ్ లేదా బద్ధకంగా అటు ఇటు తిరగడం?  అవన్నీ సరైనవి  అనిపిస్తాయి, కానీ అవి నిత్యం అందుబాటులో లేవని అనిపించడం లేదా? మంచి మానసిక శక్తిని కలిగి ఉండటం రోజువారీ అవసరం, అప్పుడప్పుడు కోరుకునే విలాసం కాదు. స్వయం పట్ల శ్రద్ధ పెట్టడానికి మరియు మనస్సును రిఫ్రెష్ చేసుకోవడానికి  ప్రతి 59 నిమిషాల తర్వాత కేవలం ఒక నిమిషం పడుతుంది. మనం రిఫ్రెష్ చేయకపోతే, మన మనస్సు అనేక తప్పుడు ఆలోచనలు మరియు ఎమోషన్స్ తో అలసిపోతుంది. రెగ్యులర్ విశ్రాంతి మరియు రీచార్జ్ మన మనస్సును  దాని పూర్తి సామర్థ్యంతో  పని చేయడంలో సహాయపడతాయి. ప్రతి గంట తర్వాత, మీ మనస్సు బాగా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని సెకన్ల పాటు పాజ్ చేయండి. మీ మనసు డిస్టర్బ్ అయితే దానికి అర్ధం చేయించండి. మనస్సు అర్థం చేసుకొని శాంతిస్తుంది. ఏ ఆలోచనలు సరైనవో, ఏది కాదో తెలుసుకుంటుంది. రోజు మీ దృఢ సంకల్పాలను రివైజ్ చేసుకోండి. ఇది మనస్సును శుభ్రపరిచి  చార్జ్ చేస్తుంది మరియు తర్వాత సమయానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఆలోచనల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సులభం మరియు ప్రభావితంగా ఉంటుంది. శాంతి మరియు ఆనందానికి తిరిగి తీసుకురావడానికి 60 సెకన్లు మాత్రమే అవసరం. దీన్ని అనుసరించి మీ మనస్సు రోజంతా ఎంత సమర్థవంతంగా ఉంటుందో చూడండి.

మీరు శక్తివంతమైన జీవి అని ప్రతి ఉదయం మీకు మీరు గుర్తు చేసుకోండి. ప్రతి పరిస్థితిలో స్థిరంగా, ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండండి. మీ మనస్సుపై శ్రద్ధ వహించండి.  మీ మనస్సు మీ శరీరం, మీ సంబంధాలు, మీ పనిపై శ్రద్ధ వహిస్తుంది. ఆలోచనల ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రతి గంటకు ఒక నిమిషం పాటు పాజ్ చేయండి. మీరు ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా లేదా ఎక్కడైనా ఉన్నా, మీరు చేస్తున్న పనుల నుండి వైదొలగి  మీ ఆలోచనలను చెక్ చేసుకోండి,  గంట ముందు  వ్యక్తులు మరియు పరిస్థితులకు మీ మనస్సు ఎలా స్పందించిందో చెక్ చేసుకోండి. ఏదైనా గాయం, ఆందోళన, గందరగోళం, కోపం ఉంటే, మీరు స్వచ్ఛమైన ఆత్మ అని అర్థం చేసుకుని మనస్సును శుభ్రం చేసుకోండి. ఆనందం మరియు శాంతి మీ స్వభావం. స్వీకరించడం మరియు అంచనాలు లేకుండా ఉండడం మీ సహజమైన గుణాలు. ఎవరూ మిమ్మల్ని బాధించలేరు, వారు బాధలో ఉన్నారని అర్థం చేసుకోండి.  మీ స్థిరత్వంతో ప్రతి పరిస్థితిని ప్రభావితం చేయండి. ప్రతిదీ పర్ఫెక్ట్ గా  ఉంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఆలోచనలు మిమ్మల్ని సురక్షితంగా తిరిగి ఆ సన్నివేశంలోకి వెళ్ళడానికి శక్తివంతం చేస్తాయి. ఉదయం 30 నిమిషాల మెడిటేషన్, ప్రతి గంట తర్వాత ఒక నిమిషం ట్రాఫిక్ కంట్రోల్, రాత్రి 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఇంట్లో, పనిలో మరియు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »
22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »