Hin

ప్రతి కర్మ పట్ల శ్రద్ధ

ప్రతి కర్మ పట్ల శ్రద్ధ

మన ప్రతి ఆలోచన, మాట మరియు కర్మ మనం ప్రపంచానికి పంపే శక్తి, దీనినే కర్మ అని  అంటారు. విధి అంటే మనకు పరిస్థితులు మరియు వ్యక్తుల ప్రవర్తనల యొక్క  శక్తి.  ప్రతి కర్మ ఆత్మలో రికార్డు అయ్యి ఈ జన్మలో లేదా మరు జన్మలో దాని పర్యవసనాన్ని తెస్తుంది. అంతర్గత శక్తితో మనం సరైన కర్మలను చేయడం నేర్చుకుంటాము మరియు గత కర్మల యొక్క పరిణామాలను స్థిరంగా ఎదుర్కొంటాము. జీవితం సాఫీగా ఉన్నప్పుడు పరిస్థితులకు మీరు క్రెడిట్ తీసుకుంటారా? జీవితం కఠినంగా ఉన్నపుడు  మీరు భాగవంతున్ని లేదా ఇతర వ్యక్తులను నిందిస్తారా? మీరు మీ విధిని మీరే తయారు చేసుకుంటున్నారని అనుకుంటున్నారా ? లేదా అది ముందుగా నిర్ణయించబడిందని మీరు నమ్ముతున్నారా? మన విధికి మనమే సృష్టికర్తలం. ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది, అది ఈ రోజు, కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాలలో లేదా కొన్ని జన్మలలో మనకు తిరిగి వస్తుంది. మనకు ఏమి జరుగుతుందో దానికి ప్రతిస్పందనగా ఈ రోజు మనం చేసేది మన ప్రస్తుత కర్మ, మరియు పూర్తిగా ఇది మన ఎంపిక. పరిస్థితితో సంబంధం లేకుండా ఇప్పుడు సరైన ఆలోచన, పదాలు మరియు ప్రవర్తనలను ప్రస్తుత కర్మగా రూపొందిద్దాం. వర్తమాన సమయంలో చేసే సరైన కర్మ గతంలోని కర్మల  ఖాతాలను తీరుస్తుంది, నేటి కోసం ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని మరియు మన భవిష్యత్తు కోసం అందమైన విధిని తయారు చేస్తుంది. వ్యక్తులు మరియు పరిస్థితి మనకు ఏమి చేస్తాయో దానిపై దృష్టి పెట్టకుండా, మన కర్మలను సరిగ్గా ఉంచుకోవడంపై దృష్టి పెడదాం.

మీరు మీ జీవిత ప్రయాణంలో మీ జీవితాన్ని మీ విధానంలో,  మీ విలువలు మరియు సూత్రాల ప్రకారం జీవిస్తున్నారు. అది సాధారణమైన విషయాలైన ఆహారం , డ్రెస్సింగ్ లేదా జీవన అలవాట్లు లేదా సంస్కారాలు అయినా, మీ కర్మల ఖాతాకు సరైనది, మీ అంతర్గత శక్తిని పెంచేది, ఆనందాన్ని పంచేది మాత్రమే ఎంచుకోండి. పరిస్థితులతో సంబంధం లేకుండా మీ ప్రతి ఆలోచన, మాట మరియు ప్రవర్తన స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా ఉండాలి. శాంతి మరియు సంతోషం యొక్క మీ అసలు గుణాలను ఏమర్జ్ చేసి ప్రతి కర్మలో వాటిని ఉపయోగించండి. ప్రజలతో, ప్రకృతితో, వస్తువులతో, మీకున్న ప్రతిదానితో మంచి కర్మ సంబంధాలను కలిగి ఉండండి. ఈ రోజు మీకున్న ఆనందం, ఆరోగ్యం, సామరస్యం మరియు విజయాలు అన్నీ మీ అందమైన గత కర్మల వల్లనే. మరియు మీకున్న కొన్ని సవాళ్లు అంతగా సరికాని మీ గత కర్మల యొక్క పరిణామాలు. వర్తమానలోనే మీ శక్తి ఉందని గ్రహించి ప్రశ్నలు లేకుండా ఆ సవాళ్లను  అంగీకరించి ఎదుర్కోండి. గతంలోది తీర్చుకునేందుకు మరియు సంతోషకరమైన భవిష్యత్తును పొందేందుకు వర్తమానంలో  స్వచ్ఛమైన కర్మలను ఎంచుకోండి. వీరు సరైన వారు అని అనిపించే  ప్రతి ఒక్కరికీ, అలాగే సరైనవారు కాని వారికైనా కూడా, మీ అంతర్గత శక్తిని పెంచుకొని మీ గత కర్మల ఖాతాను తీర్చుకోవడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి. ప్రతి క్షణంలో మీ కర్మల ఖాతాలన్నీ తీర్చుకుంటూ ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »