Hin

మీరు ఏ అలవాటునైనా మార్చుకోవచ్చు

మీరు ఏ అలవాటునైనా మార్చుకోవచ్చు

మీరు చిన్నప్పటి నుండి ఈ అలవాటు చేసుకున్నారు, మీరు ఎప్పటికీ ఈ అలవాటు మార్చుకోలేరు అని మీరు ఎవరితోనైనా లేదా ఎవరైనా మీతో అన్నారా?  ముఖ్యంగా బలమైన పాత అలవాటును మార్చడం కష్టం లేదా అసాధ్యం అని మీరు నమ్ముతున్నారా? ముందుగా నేను అలవాట్లను మార్చుకోలేను అని చెప్పే అలవాటును మార్చుకోవాలి. ఏదైనా అనారోగ్యకరమైన లేదా అసౌకర్యమైన అలవాటును ఖచ్చితంగా మార్చవచ్చు. నాకు ఆలస్యంగా రావడం, కబుర్లు చెప్పడం, చిరాకుగా ఉండడం, అల్పాహారం మానేసే అలవాటు ఉందని,  కాబట్టి నేను మార్చుకోలేను అని అనకండి. మనం పదే పదే చేసేది మన అలవాటుగా అవుతుంది. కొన్ని సార్లు నివారించడం లేదా మార్చడం ద్వారా, పాత అలవాటు పోతుంది. మనం ఇంతకుముందు విఫలమైనప్పటికీ దానిపై నిరంతరం కృషి చేయాలి. మనం వదిలేస్తే, అది బలపడి మన సంకల్ప శక్తి బలహీనమవుతుంది. మన అసౌకర్య అలవాట్లను ఎదుర్కొని మనల్ని మనం నేను ఈ అలవాటును ఎందుకు మార్చుకోవాలి? ఎలా మార్చాలి? నేను మారాలనుకుంటున్నానా?  అని ప్రశ్నించుకుందాం. ఒకసారి మనకు మార్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే, మార్చడం సులభం అవుతుంది. 

మనకు తెలిసిన వారిలో అలవాటు మార్చుకోని వారు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఎవరూ ఉండకపోవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ కొన్ని అలవాట్లను కొన్ని కారణాల వల్ల మార్చుకున్నాము. మనం అలవాట్లను మార్చుకోలేమనే తప్పుడు నమ్మకం నెగెటివ్ అలవాట్లను బలపరిచి మన పరివర్తనను అడ్డుకుంటుంది. మీరు మీ అలవాట్లను ఎలా నియంత్రిచాలో మరియు మీ అలవాట్లు ఇకపై మిమ్మల్ని నియంత్రించకుండా ఏమీ చేయాలో  చెక్ చేసుకోండి. మీరు పదేపదే చెక్ చేసుకుంటూ నిజంగా ఏమి కావాలనుకుంటున్నారో ఆ సంకల్పాలను చేసినట్లైతే మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. మీరు అసౌకర్య అలవాట్లు, ఆధారపడటం మరియు వ్యసనాలను వదిలివేస్తారు. మీ మనసులో ఉన్నవాటిలో మీరు సులభంగా ఎంచుకోగలుగుతారు. మీరు మార్చుకోలేని అలవాటు ఉండదు. అతిగా టీ,  కాఫీ తాగడం లేదా తినేటప్పుడు టీవీ చూడటం వంటి చిన్న అలవాట్లే కాదు, మీరు లోతైన వ్యసనాలను అధిగమించవచ్చు. మీరు చివరికి మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »