Soul sustenence 29th june telugu

గౌరవము మరియు ఆదరణ – ఈ రెండూ ఒకటేనా?

అందరూ అనుకున్నట్టుగా కాకుండా, గౌరవం మరియు ఆదరణ  భిన్నమైనవి. ఆదరణ అనేది వ్యక్తుల పాత్రలు,  హోదా వలన ఇవ్వబడిన మర్యాద యొక్క బాహ్య చిహ్నం. గౌరవం అనేది అంతర్గతమైనది, ఆ  వ్యక్తి ఔన్నత్యాన్ని బట్టి వచ్చే భావన మరియు వైబ్రేషన్. ఆదరణ మారవచ్చు, కానీ గౌరవం అందరికీ సమానంగా ఉండాలి. వ్యక్తులను గౌరవించడం మరియు వారిని ఆదరించడం కోసం మీ అంచనాలు ఏమిటి? వయస్సు లేదా హోదా ప్రకారం మీ కంటే జూనియర్ లేదా మీ కంటే తక్కువ సాధించిన వారితో మీరు ఎంత బాగా వ్యవహరిస్తారు? గౌరవం మరియు ఆదరణ ఒకటే అని మీరు నమ్ముతున్నారా? సమాజంలో మన పాత్రలు మరియు హోదాలు భిన్నంగా ఉంటాయి. మనం పాత్రలను హెచ్చు తగ్గులు గా చూస్తాము.  మనము గౌరవం మరియు ఆదరణ లను మిక్స్ చేసేసాము కూడా. గౌరవం అనేది ఒక వ్యక్తి గురించి మనకున్న అనుభూతి. ఆదరణ అనేది వ్యక్తుల విజయాలు, పాత్రలు మరియు వారి సొత్తు యొక్క బాహ్య చిహ్నం. వ్యక్తుల పాత్రలు మరియు హోదా ప్రకారం మనం మర్యాదలను ఇవ్వాలి మరియు బాహ్యమైన  విధానాలను అనుసరించాలి. కాబట్టి ఆదరణ వ్యక్తి యొక్క పాత్రకు ఇవ్వబడింది. గౌరవం అనేది ఆ వ్యక్తి ఎవరో, ఎటువంటి వారో, దాని ప్రకారం ఇవ్వబడింది. మనమందరం స్వచ్ఛమైన, మంచి మరియు  సమానమైన ఆత్మలం కాబట్టి, గౌరవం మారకూడదు. ప్రతి వ్యక్తి సమానంగా మరియు ఒకే రకంగా గౌరవించబడాలి. మంచి ఆలోచనలను ఆలోచించి, మంచిగా మాట్లాడండి మరియు అందరితో  స్నేహపూర్వకంగా ఉండండి. ఇలా వారి పట్ల గౌరవం రేడియేట్ అవుతుంది. వారికి ఉన్నదాని ఆధారంగా మీరిచ్చే ఆదరణ మారవచ్చు, కానీ వారి పట్ల మీ గౌరవం మారకూడదు.

గౌరవం అనేది మీ సంబంధాలకు పునాది, గౌరవము మరియు ఆదరణ భిన్నమైనవని గుర్తించండి. ఆత్మకు గౌరవం ఇవ్వండి మరియు వారి కార్యానికి ఆదరణ ఇవ్వండి. వ్యక్తుల వయస్సు, జ్ఞానం, విజయాలు, సంపద, పాత్రలు లేదా హోదాలకు ఆదరణ ఇవ్వండి. గౌరవాన్ని, ఆదరణని సమానం చేయవద్దు. వ్యక్తుల పాత్రను బట్టి మీరిచ్చే గౌరవం మారకూడదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మీరు వారిని గౌరవిస్తూనే ఉండాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మరియు అందరినీ గౌరవించండి. ప్రతి వ్యక్తిని వారు ఎవరో, వారి లక్షణాలను, స్వభావాలను గౌరవించండి. మీ ప్రతి పరస్పర చర్యలో  ఇతరులకు స్వచ్ఛమైన వైబ్రేషన్ తో  ప్రారంభించండి. ఎవరినైనా కలవడానికి ముందు, ముందుగా వారి కోసం మంచి వ్యక్తి లేదా శాంతియుత వ్యక్తి అనే ఆలోచనను సృష్టించండి, ఆపై మీరు వారితో మాట్లాడండి మరియు చర్యలోకి రండి. వారి ప్రవర్తనను అంగీకరిస్తూ ప్రతి ఒక్కరినీ గౌరవించండి మరియు ప్రశ్నించకుండా ఉండండి. వారు ఎవరు అనే వారితో కనెక్ట్ అవ్వండి మరియు వారు పోషించే పాత్రలకు కనెక్ట్ అయ్యే ముందు, నిజమైన గౌరవం యొక్క పునాదిని నిర్మించండి. మీ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన యొక్క వైబ్రేషన్స్  అందరికీ ఒకే విధంగా ఉండాలి, మీ గౌరవం అందరికీ ఒకే విధంగా ఉండాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »