29th march soul sustenance telugu

సంతుష్ట మణిగా ఉండటం (పార్ట్ 3)

సంతృప్తి అనేది మీ ఆంతరిక సంపదలు మరియు విజయాలను పెంచడం ద్వారా వస్తుంది. మీ జీవితంలో మీకు నెగెటివ్ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా, మీ మనస్సులోని పాజిటివిటీ మీకు సంతృప్తిని కలిగిస్తుంది.  ఆ సమయంలో మీరు సాధించిన వాటి గురించి మరియు మీ ఆంతరిక సంపదల గురించి ఆలోచించడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. మీరు మీ జీవితంలో చాలా కఠిన పరిస్థితిని ఎదురుకున్నపుడు అది మీ మనస్సును నెగెటివ్ గా మారుస్తుంది. ఆ సమయంలో, మీలో  ఉన్న ఆంతరిక శక్తుల సంపద గురించి గుర్తుచేసుకొని వాటిని మీ మనస్సులో ఎమర్జ్ చేసుకోండి. మీ జీవితంలోని మంచి పరిస్థితుల గురించి ఆలోచించండి, భగవంతునితో మీ సంబంధం గురించి ఆలోచించండి. అలాగే, మీకు సన్నిహిత వ్యక్తులతో మీ సంబంధాల గురించి, వారితో మీకు ప్రేమ మరియు సంతోషం యొక్క పాజిటివ్ అనుభవాలు మరియు వారి నుండి మీరు స్వీకరించే శుభ భావనల గురించి ఆలోచించండి. మీ బుద్ధిలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆలోచిస్తే ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం . మీరు సత్యంగా,మంచితనంతో నిండి ఉంటే, ఏ నెగెటివ్ పరిస్థితులు శాశ్వతంగా ఉండదని గుర్తుచేసుకోండి. అలాగే, వివిధ మార్గాల్లో ఇతరులకు సేవ చేయడానికి మీ సమయాన్ని వెచ్చించండి. నిస్పృహకు లోనవకుండా సంతృప్తిగా ఉండడానికి ఇవి కొన్ని మార్గాలు.

అలాగే, భవిష్యత్తును పాజిటివ్ దృష్టితో చూడటం అనేది స్థిరమైన మరియు సంతృప్తికరమైన  మనసుకు అత్యంత ముఖ్యమైనది . నిరుత్సాహపడటం మరియు ఆశను వదులుకోవడం దుఃఖం మరియు అసంతృప్తికి దారి తీస్తుంది. మీ జీవితంలోని ప్రతిదాని గురించి మీరు ఎంత పాజిటివ్ గా  ఉంటారో, మీ జీవితంలోని అన్ని నెగెటివ్ పరిస్థితులు అంత త్వరగా సానుకూలంగా మారుతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే, మీరు జీవితం గురించి ఎంత నెగెటివ్ గా ఉంటే, పరిస్థితులు అంత పెద్దవిగా మారి మీకు మరింత దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి, ఎల్లప్పుడూ తేలికగా ఉంటూ మంచిగా, పాజిటివ్ గా ఆలోచిస్తూ  ప్రతి పరిస్థితిలో పాజిటివ్ గా ఉండండి.  మీ జీవితంలో  మీ ముందుకు ఏమీ వచ్చినప్పటికీ అందరికీ ఆనందాన్ని ఇచ్చే సంతుష్ట మణిగా ఉండండి, ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »