Hin

వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. జీవితంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించాలి. నా పని మరియు జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి నాకు సమయం లేదని మనం  ఫిర్యాదు చేసినప్పుడు, మనం మూడింటిలో ఒకదానిపై దృష్టి పెట్టకుండా ఉండటానికి సమయాన్ని సాకుగా ఉపయోగిస్తాము – స్వయాన్ని లేదా కుటుంబం లేదా వర్క్ .

 

  1. మీ ప్రాధాన్యతలను చెక్ చేసుకోండి – ముందు వర్క్ , తరువాత , కుటుంబం, ఆపై సమయం మిగిలి ఉంటే స్వయం అని మనం ప్రాధాన్యతలను ఇస్తున్నాం కావచ్చు. స్వయం అనేది విత్తనం, కుటుంబం అనేది కాండం(trunk), మరియు మీ వర్క్  మరియు మీరు చేసే ప్రతిదీ వృక్షం. మీ ప్రాధాన్యత వృక్షం, కాండం మరియు విత్తనం కాకూడదు. విత్తనం, కాండం, ఆపై వృక్షం మీ ప్రాధాన్యతగా ఉండాలి. మీ ప్రాధాన్యతను ఇలా మార్చుకోండి: స్వయం, కుటుంబం మరియు పని.
  2. మీ సమయాన్ని బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. మెడిటేషన్ చేయడానికి మరియు వ్యాయామం చేయడానికి ప్రతిరోజూ ఉదయం మీ కోసం ఒక గంట మీరు సమయం కేటాయించండి. అలాగే, నిద్ర కోసం 6-7 గంటలు ఫిక్స్ చేసుకోండి. సెట్ చేసిన భోజన సమయాలను అనుసరించండి మరియు జాగరూకతో తినండి. కుటుంబంతో రోజులో 3 నుండి 4 గంటలు గడపండి.
  3. మీరు మీ మనస్సుపై శ్రద్ధ పెట్టడానికి, మీ శరీర ఆరోగ్యం కోసం  మరియు అందమైన సంబంధాలను కలిగి ఉండటానికి సమయాన్ని షెడ్యూల్ చేసిన తర్వాత, మీరు పనిలో 100% శ్రద్ధ వహించగలుగుతారు. మీ ఇంట్యూషన్(intuition), నిర్ణయ శక్తి, సహయోగ శక్తి మరియు ఉత్పాదకత పెరుగుతాయి. మీరు తక్కువ సమయంలో ఎక్కువ సాధిస్తారు. మీ జీవితాన్ని సమతుల్యంగా మరియు సామరస్యంగా ఉంచడం అనేది  మీ గురించి మీరు  శ్రద్ధ వహించడం నుండి ప్రారంభమవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »