పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 3)

పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 3)

మనమే సృష్టించుకున్న పరిస్తితుల ఉదాహరణలను నిన్నటి సందేశం లో పంచుకున్నాము. ఈ పరిస్థితులు నా మనస్సు ద్వారా సృష్టించబడినవి, కొన్నిసార్లు బాహ్య పరిస్థితి ద్వారా ప్రేరేపించబడినప్పటికీ, కొన్నిసార్లు బాహ్య సంఘటన కారణం అవ్వక పోవచ్చు. అవే కాక శరీరంతో, సంబంధాలలో, ఆఫీస్ లో, ఇంట్లో ఇతర పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులన్నీ కొంతవరకు బాహ్యమైనవి మరియు కొంతవరకు అంతర్గతమైనవి. అనగా అది పట్టించుకోకుండా వదిలిపెట్టలేని వాస్తవమైన ఒక బాహ్య సంఘటన వలన కావొచ్చు. ఇది నిజమే కానీ ఎక్కువ సందర్భాలలో అక్కడ పరిస్థితి ఏమీ లేనప్పటికీ నెగిటివ్ దృష్టికోణం తో ఉన్న వ్యక్తికి అది పరిస్థితి లా అనిపిస్తుంది. అన్ని ఇతర సందర్భాల్లో, వాస్తవంగా పరిస్థితి ఉందని పాజిటివ్ దృష్టికోణం ఉన్న వ్యక్తి కూడా అంగీకరిస్తాడు. మనము ఒక పరిస్థితిని ఏ దృష్టికోణంతో చూస్తున్నాము, దానికి ఎలా స్పందిస్తున్నాము, దానిని చూసి ఎలాంటి ఆలోచనలను చేస్తున్నామనే దాన్ని బట్టి ఆ పరిస్థితి ముందు మన మనసులో పెద్దదిగా లేక చిన్నదిగా అవుతుంది. కానీ మరొక కోణం ఉంది – కొన్నిసార్లు కొన్ని జీవిత పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అవి చాలా శక్తివంతమైన ఆత్మలను కూడా డిస్టర్బ్ చేస్తాయి. వాస్తవానికి, భయం యొక్క తీవ్రత దృష్టికోణాన్ని బట్టి వ్యక్తికీ  వ్యక్తికి మారుతుంది. శక్తివంతమైన బుద్ధితో కూడిన ప్రశాంతమైన మనస్సు ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోగలదు. అలాగే, బ్రహ్మా కుమారీల వద్ద నేర్పించే మెడిటేషన్ వంటి టెక్నిక్ లు పరిస్థితులను ఎదుర్కోవటం లో మీకు సహాయ పడుతాయి. 

మెడిటేషన్ అనేది ఒక ఆలోచనల శిక్షణ ప్రక్రియ. ఒక క్రికెటర్ తను ఎదుర్కొన్న ప్రతి బంతిని, పరుగుల స్కోర్ సాధించటానికి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాడూ,  అదే విధంగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, నేను ఆ కొన్ని నిమిషాలు పాజిటివ్ సంకల్పాలనే సృష్టించటానికి నా ప్రతి సంకల్పానికి విలువను ఇవ్వటం నేర్చుకుంటాను. ఈ పాజిటివ్ సంకల్పాలు ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి. అవి ఆధ్యాత్మిక స్వయం మరియు భగవంతుడు అనగా  పరమాత్మ గురించిన సంకల్పాలు. ఈ సంకల్పాలు చాలా నెమ్మదిగా, ఒక దాని తరువాత ఒకటి,  జాగ్రత్తగా సృష్టించబడతాయి. ప్రతి రోజూ ఈ కొన్ని నిమిషాల మెడిటేషన్ ప్రాక్టీస్ అసలైన నెగిటివ్ పరిస్థితుల కోసం మనకు శిక్షణ. అప్పుడు, ఈ ప్రాక్టీస్ వలన మన జీవితంలో నెగిటివ్ పరిస్థితులు ఉన్నప్పుడు మనము ప్రశాంతంగా ఉంటూ పాజిటివ్ సంకల్పాలనే చేస్తాము. ఇంకా, మన మనస్సులో మరియు జీవితం లో డిస్టర్బ్ చేసే నెగిటివ్ సంకల్పాలను దూరంగా ఉంచుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »