02 january soul sustenance telugu

నాలో ఉన్న శ్రేష్టతకు చేరుకోవడం (భాగం -1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన అంశం – మన ప్రతీ ఆలోచనను కర్మ రూపంలో తీసుకుని రావాలని కోరుకుంటాము. “చెప్పటం చేయటం ఒకటై ఉండాలి” అనే నానుడి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, మీకు చాలా ఆదర్శవంతమైన ఆలోచనలు మరియు మంచి అభిప్రాయాలు ఉండవచ్చు. మీరు వాటిని ఆదర్శంగా తీసుకుని నడుస్తూ ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఆ ఆలోచనలు కార్య రూపంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఆదర్శాల ప్రకారం జీవించరు,ఇది మిమ్మల్ని మరియు ఇతరులను కలవరపెడుతుంది మరియు దుఃఖాన్ని ఇస్తుంది.
ఉదాహరణకు ఈ రోజు నేను ఎలాగైనా సంతోషంగా ఉండాలని మరియు అందరికీ సంతోషాన్ని పంచాలని నిర్ణయించుకుంటాను. కానీ నేను ఏదైనా పరిస్థితిని లేదా సమస్యను ఎదుర్కొన్న కొంత సమయంలోనే ఆందోళన చెంది మరియు ఇతరులను కూడా ఆందోళనకు గురిచేస్తాను. మరొక రోజు, నేను అందరికీ శుభకామనలు మాత్రమే అందించాలని నిర్ణయించుకుంటాను. కానీ ప్రతికూల ప్రవర్తనను ఎదుర్కోవలసి వచ్చిన వెంటనే,నేను నాలో ప్రేమ తగ్గిపోయి అవతలి వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించడమే కాకుండా ఇతరులతో ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. ఇది మన సంబంధాలను దిగజారుస్తుంది.
ఇలాంటి మరెన్నో నిర్ణయాలు ప్రతి రోజూ సాధించడానికి ప్రయత్నిస్తాము.కొన్నిసార్లు వాటిని చేయడంలో విజయం సాధిస్తాము ,మరి కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. దీనికి కారణం ఏమిటి? మనమందరం హృదయాంతరాలలో మంచి వ్యక్తులుము కాదా ? అంతర్గతంగా అందరూ మంచివారే .ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మలో శుద్ధమైన వారు అని ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తుంది. అలాగే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మంచి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. కొందరు తమ జీవితంలో మరియు స్వభావంలో మంచి మార్పును తీసుకురావడంలో దృఢంగా ఉంటారు మరియు కొందరు దాని గురించి ఆలోచిస్తారు కానీ దృఢ సంకల్పంతో తమ వ్యక్తిత్వంలోకి తీసుకురారు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »
22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »
21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »