2nd july 2023 soul sustenence telugu

సంతోషకరమైన ప్రపంచం కోసం 5 సహయోగ విధానాలు (పార్ట్ 2)

  1. మీ ఇల్లు మరియు కార్యాలయాన్ని సంతోషం యొక్క వలయంగా మార్చుకోండి  – మీ ప్రపంచాన్ని ఆనందంతో నింపడానికి చాలా ముఖ్యమైన మరియు సులభమైన విధానం మీ ఇల్లు మరియు కార్యాలయంలో తేలిక మరియు పాజిటివిటీ తో కూడిన వాతావరణాన్ని సృష్టించడం. మీ కుటుంబ సభ్యులు లేదా కార్యాలయ సహోద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ దుఃఖంగా ఉంటే  విజయం మరియు దృఢత యొక్క పాజిటివ్ ఆలోచనలను వారితో ప్రతిరోజూ పంచుకోండి. ప్రతి ఒక్కరూ పాజిటివ్  సమాచారంతో ఎంత ఎక్కువగా నిండితే, జీవితంలోని విభిన్న పరిస్థితుల పట్ల దృక్పథం మారి వారు మరింత పాజిటివ్ గా మారతారు. క్రమం తప్పకుండా మనస్సులలో పాజిటివిటీ ను ఇంజెక్ట్ చేసినప్పుడు, ఒత్తిడికి కారణమయ్యే వివిధ నమ్మకాలు,  విభిన్న పరిస్థితుల గురించిన అనేక ఎమోషన్స్  మారుతాయి. అలాగే, దుఃఖానికి ప్రధాన కారణం గతంలో జరిగిన పాత నెగెటివ్ అనుభవాలను గుర్తుంచుకోవడం. జీవితంలోని పాజిటివ్  సన్నివేశాలను తేలికగా మరియు ఉత్సాహంతో గుర్తుంచుకోవడం మరియు  గతంలో జరిగిన  నెగెటివ్ దృశ్యాలు మళ్లీ మళ్లీ ఎలాగూ జరగవు కనుక ఆ చెడు అనుభవాలను మరచిపోవడం అనే  శిక్షణ ఇంట్లో మరియు కార్యాలయంలోని ప్రతి ఒక్కరికీ ఇవ్వండి. 
  2. దాతగా అయ్యి మరియు శ్రద్ధ వహించే వైఖరిని అవలంబించండి – మనమందరం ఇమిడ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణం ఇవ్వడం మరియు శ్రద్ధ వహించడం. నేను కలిసిన ప్రతి ఒక్కరూ నన్ను కలిసినప్పుడు పాజిటివ్ గా ఆశీర్వదించబడాలి. మరో మాటలో చెప్పాలంటే, ప్రతిరోజు అందరికీ ఒక ఆశీర్వాదం ఇవ్వండి. మనం ఎంత ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే, ఇతరులు అంత సంతోషంగా ఉంటారు. ఆశీర్వాదం అంటే ఒక శక్తి లేదా గుణం లేదా ప్రేమ మరియు మంచితనం యొక్క కొన్ని మధురమైన పదాలు. ప్రతి ఒక్కరినీ ప్రేమపూర్వకమైన మరియు మధురమైన దృష్టితో చూడండి మరియు మీ చిరునవ్వు ద్వారా మీ అంతర్గత మంచితనాన్ని మరియు శుభకామనలను పంచుకోండి. అలాగే, అందరికీ ప్రేమతో కూడిన మృదువైన శుభాకాంక్షలు తెలియజేయండి. సంతోషంతో సంపన్నంగా అవ్వండి మరియు ఇతరులను కూడా దానితోనే సంపన్నంగా చేయండి. ఈ విధంగా శ్రద్ధ వహించడం, పంచుకోవడం మరియు ఇవ్వడం సంతోషాన్ని వ్యాప్తి చేస్తూ మీ  చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రేమ మరియు ఉత్సాహంతో నింపుతుంది. ఆందోళన, ఒత్తిడి మరియు విచారం లేకుండా చేస్తుంది.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »