వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 3)

వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 3)

సమాచారాన్ని వింటున్నప్పుడు మీ మూడవ చెవిని వినడానికి ఉపయోగించండి. మనం సాధారణంగా మూడవ నేత్రం లేదా జ్ఞాన నేత్రం అనే పదాలను ఉపయోగిస్తాము. అదే విధంగా, జ్ఞాన చెవి అంటే మీరు మీ భౌతిక చెవులతో ఒక వ్యక్తి గురించి ఏదైనా వింటున్నప్పుడు, ఏది సరైనది మరియు ఏది తప్పు అనే తేడాను గుర్తించడానికి ఈ మూడవ చెవిని ఉపయోగించండి. మీ మనస్సులో విభిన్న జీవిత పరిస్థితుల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎమర్జ్ (emerge) చేయటం అని దీని అర్థం. అలాగే, కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానాన్ని ఎమర్జ్ (emerge) చేయండి. కర్మ సిద్ధాంతం ప్రకారం, ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి చర్య ఇలాంటి ప్రతిచర్య లేదా జీవిత పరిస్థితి మనకు తిరిగి రావడానికి కారణమవుతుంది. పాజిటివ్ చర్య మనకు పాజిటివ్ జీవిత పరిస్థితిని తిరిగి తెస్తుంది మరియు నెగిటివ్ చర్య మనకు నెగిటివ్ జీవిత పరిస్థితిని తిరిగి తెస్తుంది. రెండు చెవులు భౌతికంగా వింటాయి కానీ మూడవ చెవి కర్మ సిద్ధాంతం యొక్క ఫిల్టర్‌తో ఫిల్టర్ చేసిన తర్వాత భౌతిక సమాచారాన్ని వింటుంది.  అంటే, ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి మీతో పంచుకున్న సమాచారం యొక్క ప్రతి దాగిన అంశాన్ని అర్థం చేసుకోవడం మరియు ఆ వ్యక్తి పట్ల పాజిటివ్ వైఖరిని కొనసాగించడం.

అదే సమయంలో, నిర్దిష్ట పరిస్థితిలో విజయాన్ని పొందటానికి, సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ శక్తి వంటి 8 శక్తులను ఆ నిర్దిష్ట పరిస్థితిలో ఉపయోగించండి. అంటే సరైన సమయంలో సరైన పని చేయండి – శారీరక స్థాయిలో లేదా మానసిక శక్తుల యొక్క సూక్ష్మ స్థాయిలో ఎవరి ఆసక్తులకూ హాని కలిగించకుండా సమస్యగా ఉన్న పరిస్థితిని పరిష్కరించండి. అలాగే, మనతో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలను తెలియజేయండి, వ్యర్థం మరియు నెగిటివ్ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు కార్యాలయంలో లేదా ఇంటిలో పాజిటివ్ వాతావరణాన్ని కొనసాగించండి. అలాగే, తప్పు చేసిన వ్యక్తి లేదా ఆ వ్యక్తి గురించి మీకు సరైన లేదా తప్పు సమాచారం అందించిన వ్యక్తితో సహా ప్రతి ఒక్కరి గురించి మంచి సమాచారాన్ని వ్యాప్తి చేయండి. చివరగా, ప్రతి ఒక్కరి అసలైన గుణాలు శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరినీ వారి అసలైన గుణాల ఈ కళ్ళజోడుతో చూడండి మరియు వివిధ రంగుల నెగిటివిటీ మరియు బలహీనతలు అనే ఫిల్టర్‌లతో చూడకండి. అప్పుడు అందరూ అందంగా కనిపిస్తారు. వైఖరి ముఖ్యమైనది మరియు ఇది విజయానికి కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల వైఖరిని ఎల్లప్పుడూ మంచిగా, స్వచ్ఛంగా మరియు పాజిటివ్ గా ఉంచండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »