2nd march soul sustenance telugu

విజయానికి 8 శక్తులు (భాగం 4)

రోజును ప్రారంభించేటప్పుడు, మొదటి క్షణం నుండి రోజు చివరి వరకు నేను స్థిరంగా ఉంటానని మరియు 8 శక్తులలో ఏదీ లోపించదు అని మీతో మీరు మాట్లాడుకోండి. 8 శక్తు లు – సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలించే శక్తి, నిర్ణయించే శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ శక్తి. అప్పుడు, నిర్ణీత గమనికతో రోజులోకి అడుగు పెట్టండి మరియు ఈ మొదటి శక్తివంతమైన ఆలోచన రోజుకు ఎలాంటి తేడాను తెస్తుందో చూడండి. ఇది లేచి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం లాంటిది. అలా చేయడం వల్ల కేవలం ఉదయమే కాకుండా రోజంతా పాజిటివ్ గా గడిచిపోతుంది. అదే విధంగా మన ఎమోషన్స్ పై విజయం సాధించాలనే దృఢ సంకల్పం ఉదయాన్నే చేస్తే అదే ఆ రోజు యొక్క గొప్ప ప్రారంభం అవుతుంది . ఇలా చేస్తూ చేస్తూ రోజంతా వచ్చే వివిధ రకాల సమస్యల ప్రభావాల నుండి మనల్ని మనం రక్షించుకునేలా చేస్తుంది. రాత్రి వరకు మనల్ని దృఢంగా ఉంచే ఉదయపు మంత్రం అని చెప్పవచ్చు.

రోజును దృఢంగా ప్రారంభం చేయడం సగం పనిని పూర్తి చేస్తుంది. మనసును అదుపులో ఉంచుకుంటూ సంబంధాలను చెక్కుచెదరకుండా ఉంచడంలో విజయం సాధించడానికి ఇది పునాది. అలాగే, కుటుంబంలో మరియు కార్యాలయంలో మన రోల్ సజావుగా నడుస్తుంది. దీని వలన ధనాన్ని స్థిరంగా హ్యాండిల్ చేయగలం మరియు ఏవైనా శారీరక అనారోగ్యాల వల్ల కలిగే దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. కనుక, రోజును ప్రారంభించడానికి ఎప్పుడూ తొందరపడకండి. రోజుని తొందరపాటుతో ప్రారంభించడం అనేది రోజంతటిలో గందరగోళం మరియు శక్తిహీనతను తీసుకువచ్చే ఒక ఖచ్చితమైన పద్ధతి. ఇదే పదేపదే వైఫల్యానికి ప్రధాన కారణం కూడా . విజయం సాధించే శక్తి అంటే భౌతిక స్థాయిలో విజయం సాధించడమే కాదు, ఏదైనా చేసేటప్పుడు సంతోషంగా, సంతృప్తిగా, ప్రశాంతంగా మరియు తేలికగా ఉండగల సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది. కనుక, భౌతిక స్థాయిలో రోజును ఆనందించండి, కానీ శక్తి మరియు తేలికతనం యొక్క అనుభవాలు లేకుండా మీరు లోపల నుండి సంతృప్తి చెందలేరు మరియు జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేరు అని మర్చిపోవద్దు. దాని కోసం, ఉదయాన్నే శక్తి మరియు దృఢ సంకల్పం యొక్క ప్రతిజ్ఞ చేయడం చాలా ముఖ్యమైనది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »