సంభాషణలలో అతిశయోక్తిని నివారించడం

సంభాషణలలో అతిశయోక్తిని నివారించడం

మన కుటుంబ సభ్యుల ముందు వాస్తవాలు మాట్లాడుతున్నా లేదా స్నేహితులకు ఒక సంఘటనను వివరించినా, మనం కొన్నిసార్లు అతిశయోక్తంగా చెప్తాము. ఏదైనా చాలా ముఖ్యమైనదిగా లేదా దాని కంటే మెరుగైనదిగా లేదా దాని కంటే తక్కువదిగా అనిపించేలా చేయడం ద్వారా, మనము పరస్పర చర్యలను అవాస్తవం చేస్తాము. అంతేకాకుండా, నెగెటివ్ అనుభవాన్ని పెద్దది చేయడం మన మనస్సులోని విషయాలను క్లిష్టతరం చేసి నెగెటివ్  ప్రకంపనలను ఆకర్షిస్తుంది.

  1. మీ సంబంధాలలో అతిశయోక్తంగా చెప్పడం ఇష్టపడే వారు ఎవరైనా ఉన్నారా? మీరు తప్పించుకోవాలనుకున్నా ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ డ్రామాలోకి తెసుకువెళ్తారా? కొన్ని సమయాల్లో, మీరు కూడా వివిధ కారణాల వల్ల, వివిధ విస్తరణలకు అతిశయోక్తి చేస్తారా?
  2. చాలా మంది వ్యక్తులు నేడు అతిశయోక్తి చేస్తారు, వారి స్వంత దృక్పథం మరియు వ్యక్తిత్వ లక్షణాలతో పరిస్థితిని చిత్రీకరిస్తారు, తద్వారా సత్యాన్ని వక్రీకరిస్తారు. మనము దృష్టిని ఆకర్షించటానికి కావచ్చు, అదనపు ప్రభావాల కోసం నాటకీయంగా ఉండవచ్చు లేదా ఎవరినైనా ఒప్పించాలనుకోవచ్చు. కానీ సత్యాన్ని మంచిగా లేదా అధ్వాన్నంగా చేయడానికి సాగదీయడం మన ఆంతరిక శక్తిని మరియు విశ్వసనీయతను తగ్గిస్తుంది.
  3. మనలో ఉన్న ఆందోళన, భయం లేదా ఉత్సాహాన్ని జోడించకుండా, పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం ప్రారంభిద్దాం. మనం మన మనస్సులో అతిశయోక్తం చేసుకుంటే, మన మాటలలో  ఖచ్చితంగా అతిశయోక్తం చేస్తాము. అస్తవ్యస్తంగా ఉన్న మనస్సుపై కొంచెం శ్రద్ధ చూపడం వల్ల అదనపు సమాచారాన్ని తొలగించి కేవలం వాస్తవాలనే తెలియ చేయగలుగుతాం.
  4. అది నెగెటివ్ సమాచారం అయినా, ఆరోగ్యపరమైన ఆందోళన అయినా లేదా సాధారణ సంభాషణ అయినా, సత్యాలను చెప్పే శక్తిని కలిగి ఉండండి. మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను అతిశయోక్తం చేయను. సత్యంగా ఉండటం వల్ల నేను లోపల మరియు వెలుపల శుభ్రంగా ఉంటాను మరియు నన్ను అందరూ నమ్ముతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »