దివ్యంగా, అందంగా రక్షా బంధన్ జరుపుకోవడం (పార్ట్ 3)

దివ్యంగా, అందంగా రక్షా బంధన్ జరుపుకోవడం (పార్ట్ 3)

రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకోవడం, తిలకం పెట్టడం, పవిత్రమైన దారం కట్టడం, స్వీట్లు ఇవ్వడం మరియు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడంతో ప్రారంభమవుతుంది.

  1.   శుభాకాంక్షలు – మన ప్రతి ఆలోచన మరియు మాట అందరికీ ఆశీర్వాదం కావాలి. వారి సంస్కారాలు మరియు ప్రవర్తనలతో సంబంధం లేకుండా, మనం వారి సంస్కారాలను మార్చడానికి వారికి శక్తినిచ్చే స్వచ్ఛమైన మరియు సానుకూల ఆలోచనలు, పదాలను మాత్రమే ఉపయోగిద్దాం. మనం వారికి ఆశీర్వాదాలను ప్రసరిద్దాంస, అది వారి వాస్తవికతగా మారుతుంది మరియు వారి విధిని మారుస్తుంది. మనం ఇప్పటికీ పట్టుకొని ఉన్న గత బాధలన్నింటినీ తొలగిద్దాం ఎందుకంటే అవి మనకు అశుద్ధమైన మరియు ప్రతికూల ప్రకంపనలను ప్రసరింపజేశాయి కాబట్టి.
  2.   తిలకం – ఆత్మకు ఆసనమైన నుదిటి మధ్యన మనం తిలకాన్ని పెడతాం, ఇది మూడవ కన్ను తెరవడానికి ఒక స్మరణ. తిలకం పెట్టడం అంటే నేను ఈ శరీరం, పాత్రలు మరియు సంబంధాలను కాను అనే వాస్తవాన్ని మేల్కొల్పడం. నేను ఒక దివ్యమైన దైవిక ఆత్మను, నేను పరస్పరం సంభాషించే ప్రతి ఒక్కరు కూడా నావంటి దివ్యమైన ఆత్మలే. ఇది ఈ జీవితంలో మనం సంపాదించిన ప్రతిదాని గురించిన దేహ అభిమానాన్ని సమాప్తం చేస్తుంది. దేహాభిమానము అన్ని దుర్గుణాలకు పునాది. ఆత్మ చైతన్యమే అన్ని ధర్మాలకు పునాది.
  3.   రాఖీ – రాఖీ అనేది రక్షణ అనే పదం నుండి ఉద్భవించింది. రాఖీ కట్టడం అనేది ప్రతి ఆలోచన, మాట మరియు కర్మలో స్వచ్ఛత మరియు ప్రేమతో కూడిన మన అసలు సంస్కారాలను ఉపయోగిస్తామని చేసే ప్రతిజ్ఞకు ప్రతీక, ఇది మన రక్షణ. రాఖీ మన మణికట్టు మీద కట్టి ఉంచబడినప్పుడు, రాఖీ అనేది మనకు మరియు దేవునికి మనం చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది.
  4.   మిఠాయిలు – మన ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలు మరియు మాటలు ఎల్లప్పుడూ మధురంగా ​​ఉండాలని ఇది గుర్తుకు తెప్పిస్తుంది. ఇది మన సంబంధాలలో సామరస్యాన్ని కలిగిస్తుంది.
  5.   బహుమతులు – మనల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా వ్యసనం, అలవాటు లేదా సంస్కారాన్ని ఎంచుకుందాం, ఈ రక్షా బంధన్ రోజున దానిని వదులేద్దాం. ఇది మనకు, మన కుటుంబానికి మరియు దేవునికి మనం ఇవ్వగల ఉత్తమమైన బహుమతి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »