Hin

30th jan soul sustenance telugu

సంబంధాలను సమన్వయం చేయడం … బాధ్యతను స్వీకరించడం

వివాదాస్పద సంబంధంలో, సమస్య ఆ వ్యక్తితో లేదా మన మధ్య కాదు. వివాదం అనేది మన మనస్సులో ఉంది, మనం ఎదుటి వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తాం – వారిని నిందించడం, ప్రతిఘటించడం లేదా తిరస్కరించడం. వివాదం ఇద్దరూ సృష్టించారు కాబట్టి ఇద్దరూ దాన్ని పరిష్కరించుకోవాలి అని మనం నమ్ముతాము. నిజమేమిటంటే, మనలో కేవలం ఒకరు మరొకరి కోసం మంచిగా ఆలోచించినా, వివాదం సద్దుమణుగుతుంది. మీకు ఎవరితోనైనా విభేదాలు వచ్చినప్పుడు, మీరు భాదపడతారు లేదా కోపంగా ఉంటారు మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ఎదుట వారు ఏమి చేస్తారో అని ఎదురుచూస్తారా? మీరు సామరస్యాన్ని స్నేహపూర్వకంగా తిరిగి తీసుకురావడానికి స్వచ్ఛందంగా ముందుకు సాగుతున్నారా? లేదా, మీలో ఇద్దరు వివాదాన్ని ప్రారంభించినందున, మీరిద్దరూ సంబంధాన్ని సరి చేయాలని మీరు నమ్ముతున్నారా? ఒక వ్యక్తి మరొకరి పట్ల నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభించినప్పుడు సంబంధం విచ్ఛిన్నమవుతుంది. మాటలు మరియు ప్రవర్తనలు పర్ఫెక్ట్గా ఉండవచ్చు, కానీ నెగిటివ్గా ఆలోచన ప్రకంపనలు బంధం యొక్క పునాదిని తాకుతాయి, నెగిటివ్గా వాతావరణాన్ని తయారుచేసి త్వరగా దానిని వివాదంగా మారుస్తాయి. వివాదాస్పద సంబంధాన్ని సరి చేయడానికి కేవలం ఒక వ్యక్తి మాత్రమే అవసరం. ఆ ఒక్కరు మనం అవుదాం . సమస్యకు మాలో ఒకరు లేదా ఇద్దరూ సహకరించారా అనే పట్టింపు మనకు అవసరం లేదు. ఆ సమస్య వలన ఎంత నెగిటివ్ ఎనర్జీ ఇచ్చిపుచ్చు కున్నామో కూడా ఆలోచించ వలసిన అవసరం లేదు. మనలో ఒకరు మరొకరి పట్ల పాజిటివ్గా మరియు స్వచ్ఛంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు, మన వైబ్రేషన్స్ ప్రసరించి వారి ఆలోచనా విధానాన్ని కూడా మారుస్తాయి. వారి మనసు సరి అయిన తర్వాత, సంఘర్షణ తొలగిపోయి ఒకటై పోతారు. మీరు ఏదైనా వివాదాస్పద సంబంధాన్ని సరి చేసే బాధ్యత తీసుకోండి . గతాన్ని వదిలేయండి, వారిని క్షమించండి మరియు అలాంటి వ్యక్తుల కోసం స్వచ్ఛమైన మరియు శుద్ధమైన ఆలోచనలను ఆలోచించండి. సంబంధం యొక్క ఎనర్జీని మార్చడానికి వారి కోసం మీ ఆలోచనను మార్చండి.

మీరు అందరితో మంచిగా ఉండడమే మీ సంబంధాలలో ఆనందానికి మరియు సామరస్యానికి మూలం. ఏవైనా విభేదాలు లేదా వివాదాల ఉంటే, వాటి నుండి వైదొలగండి. మీరు అవతలి వ్యక్తి యొక్క దృక్కోణాన్ని అర్థం చేసుకోలేకపోయినా, వారు చెప్పేది లేదా చేసేది ఆ సమయంలో వారికి సత్యమని తెలుసుకోండి. సరైనది లేదా ఉన్నతమైనది అనే అహం కంటే సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు సంఘర్షణను పరిష్కరించడానికి నిజాయితీగా ప్రయత్నించండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని నయం చేసే వరకు వేచి ఉండకండి, వారు నొప్పిని కలిగి ఉంటారు, వారు మీకు నెగిటివ్ ఎనర్జీని పంపిస్తుండవచ్చు, కానీ మీరు స్థిరంగా ఉండి చాలా శ్రద్ధ మరియు ప్రేమగల ప్రకంపనలతో వారి నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కోండి. ప్రేమ యొక్క శక్తిని మీ వైపు నుండి ప్రవహిస్తూ ఉండాలి , సామరస్యం యొక్క ఆలోచనలను సృష్టించండి, మీ సంబంధాన్ని పర్ఫెక్ట్గా ఉందని విజయువలైజ్ చేసుకోండి. స్వచ్ఛమైన వైబ్రేషన్‌లను ప్రసరింపజేయండి, తద్వారా అవి వారి భావోద్వేగ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి మరియు మీలాగే మరింత సానుకూలంగా మరియ స్వచ్ఛంగా  ఉంటారు .

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »