ప్రతి బాధ్యతను గౌరవించండి

ప్రతి బాధ్యతను గౌరవించండి

మనమందరం ఎల్లపుడూ మన బాధ్యతలను నెరవేర్చి, సమయం ప్రకారం పనులను చేయాలని కోరుకుంటాము. దీని అర్థం మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే మన ఉద్దేశ్యం గురించి మన శరీరానికి, మనస్సుకు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ పంపుతున్నాము. మనం చేస్తాం అని చెప్పినట్లు చేయడం ద్వారా, మనం ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవడమే కాకుండా, మనపై మనకు గౌరవం పెరుగుతుంది. మనం మాటకు కట్టుబడితే మన వ్యక్తిత్వం, విశ్వాసం, సమగ్రత మరియు సెల్ఫ్-ఇమేజ్ ని పాజిటివ్ గా ప్రభావితం చేస్తుంది. చాలా సార్లు మనం  ఇచ్చిన మాటపై నిలబడడానికి ప్రయత్నిస్తాము. కానీ కొన్నిసార్లు మనం వాగ్దానం చేసిన వాటిని చేయము. అనివార్యమైన సందర్భాలు తప్ప, ఇచ్చిన ప్రతి మాటకు విలువను ఇవ్వడం మనం సాధన చేయాలి.

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మరియు మీ గౌరవాన్ని పెంచుకునేందుకు ఈ విధానాలను అనుసరించండి:

  1. మీరు ఇచ్చే మాట మీ ప్రాధాన్యతలు, వేగం, సామర్థ్యం, వనరులు మరియు విలువలకు అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే మీరు పోటీలో లేరు. జాగ్రత్తగా ఆలోచించి మాటను ఇవ్వండి.  
  2. విజయం సాధించాలని కేవలం ప్రయత్నించడం, కోరుకోవడం లేదా ఆశించడం కాదు. నిర్ణయించుకొని  విజయం వైపు  దృఢంగా ఉండండి.
  3. విజయానికి చేరుకోవడానికి ప్రతి రోజూ నేను ఎలా ఉండాలి మరియు ఏమి చేయాలి అని ఆలోచించుకొని లక్ష్యాన్ని సాధించినట్లు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. అవి మీ మనసుకు మరియు శరీరానికి, సహకరించమని  సిగ్నల్స్ ఇవ్వడం లాంటివి.
  4. సందేహం లేదా భయం యొక్క ఏ ఒక్క ఆలోచనతో కూడా మీ దృఢ సంకల్పాన్ని వదలకండి. మిమ్మల్ని మీరు నమ్మండి.

ఈ అభ్యాసాలు మీరు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సహాయపడతాయి, కనుక ఈ అభ్యాసాలు రిపీట్ చేయండి.

నేను తెలివైన వ్యక్తిని … నేను నిజాయితీపరుడిని మరియు క్రమశిక్షణతో ఉన్నాను … నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి … నేను వాటిని చేయగలనా అని చెక్ చేసుకుంటాను … నేను నా సమయ పరిది లెక్క వేసుకుంటాను … నేను నా సామర్థ్యాన్ని చెక్ చేసుకుంటాను … అది నా సూత్రాలకు అనుగుణంగా ఉందో లేదో అని నేను చూసుకుంటాను … నేను దీన్ని చేయగలనని నమ్మకం కలిగితేనే … నేను మాట ఇస్తాను … నేను చేస్తాను … నేను ఎంచుకున్నది సాధిస్తాను … పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు … నేను దృఢంగా … నేను ఇచ్చిన మాటను  నెరవేరుస్తాను. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »