Hin

Soul sustenence 30th june telugu

శక్తులను ఉచ్ఛ్వాశించండి, బలహీనతలను వదలండి

మనమందరం ఫిట్‌నెస్ కోసం లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేస్తాము. కానీ మనం వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా శ్వాస పద్ధతులను అభ్యసిస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే, మన మనస్సు ఆందోళన, భయం మరియు నొప్పి యొక్క నెగెటివ్ ఆలోచనలను సృష్టిస్తుంది. దాని వలన మన శరీరం బలపడినప్పటికీ మనస్సు క్షీణిస్తుంది. వర్కవుట్‌ల సమయంలో లేదా రోజంతటిలో  కేవలం ఒక చిన్న అభ్యాసంతో మనస్సును అప్రయత్నంగా శక్తివంతం చేసుకోవచ్చు. ప్రతి శ్వాసతో – ఒక బలాన్ని పీల్చుకోండి, బలహీనతను వదలండి. మీరు ఏదైనా శారీరక వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు – అది నడక, జాగింగ్, వ్యాయామం, యోగా, ప్రాణాయామం లేదా శ్వాస-నియంత్రణ పద్ధతులు ఏదైనప్పటికీ,  ఆ సమయంలో మీరు ఏమి ఆలోచిస్తారు? మీ ఆలోచనలపై మీరు అవగాహన కలిగి ఉంటారా లేదా మీ మనసుకు వచ్చే ఆలోచనల పై ఎటువంటి అవగాహన  లేకుండా ఉంటారా? శారీరక వ్యాయామాల సమయంలో, సవాళ్ల గురించి, ఇతర వ్యక్తుల గురించి, గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం, దృశ్యాలను రూపొందించుకోవడం లేదా గాసిప్‌లో మునిగిపోవడం వంటి వాటి గురించి  యాదృచ్ఛికంగా ఆలోచిస్తాము. మనం ఒకవైపు శరీరాన్ని శక్తివంతం చేస్తాము, కానీ మన అనవసరమైన ఆలోచనలు మరియు సంభాషణలు శరీరాన్ని బలహీన పరిచే వైబ్రేషన్స్ ను  ప్రసరింపజేస్తాయి. 20 నిమిషాలు మనకు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వాలని నిర్ధారించుకుందాం. మౌనంలో లేదా చాలా తక్కువ సంభాషణలతో వర్కవుట్ చేద్దాం.  సంభాషణలో ప్రతి ఆలోచన మరియు మాట శక్తివంతం కావాలి. ప్రతి శ్వాస లోపలికి మరియు బయటికి సరైన ఆలోచనలతో అనగా శక్తులను ఉచ్ఛ్వాశించండి, బలహీనతలను వదలండి. ఉదాహరణకు – నేను ఆనందాన్ని పీల్చుకుంటున్నాను, నేను ఆందోళనను వదులుతున్నాను. సరైన ఆలోచనలతో మనస్సు శరీరానికి వైద్యం చేసే శక్తిని ప్రసరింపజేస్తుందని గుర్తుంచుకొని మీ ఆలోచనలను మీరు గమనించుకోండి.

మీరు ఒక శాంత స్వరూప ఆత్మ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. శాంతి మీకు సహజంగా వస్తుంది. మీ పరస్పర చర్యలలో, పరిస్థితులకు ప్రతిస్పందించడంలో రోజంతా రిలాక్స్‌గా ఉండండి. మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాలు మెడిటేషన్, 20 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించి మీ మనస్సు మరియు శరీరానికి శక్తినివ్వండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను ప్రయోజనకరమైన మార్గంలో మళ్లించి మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. ప్రతి శ్వాసతో, జాగ్రత్తగా ఉండి, మీ మానసిక స్థితిని సులభతరం చేయండి. ప్రతి శ్వాస లోపలికి మరియు బయటికి సరైన ఆలోచనలతో అనగా శక్తులను ఉచ్ఛ్వాశించండి, బలహీనతలను వదలండి. శాంతిని పీల్చుకోండి, ఒత్తిడిని వదులండి, కరుణను పీల్చుకోండి, కోపాన్ని వదులండి, విశ్వాసాన్ని పీల్చుకోండి, భయాన్ని వదలండి. ప్రతి శ్వాసతో శక్తివంతమైన వైవరేషన్స్  తీసుకొని, నెగెటివ్ శక్తిని బయటకు పంపండి. మీ శ్వాసను, మీ ఆలోచనలను నియంత్రించండి. మీ శరీరాన్ని, మీ మనస్సును నయం చేసుకోండి. పగటిపూట, పని చేస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. శక్తివంతంగా, రిఫ్రెష్‌గా, ఆత్మవిశ్వాసాన్ని అనుభూతి చెందడానికి అప్రయత్నంగా మీ శ్వాసను ఉపయోగించండి. ఒక సవాలు తలెత్తినప్పుడు, మీరు ఆటో-పైలట్ ప్రతిచర్యలను నివారించి మీరు సరైన ఆలోచనలను సృష్టించి, అవగాహన మరియు స్థిరత్వంతో ప్రతిస్పందిస్తారు. మీరు పరిస్థితిని సులభంగా, రిలాక్స్‌గా మరియు ఒత్తిడి లేకుండా దాటుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 1)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1) మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »