30th march

సోషల్ మీడియాలో గాసిప్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను గురించి  నెగెటివ్ గా మాట్లాడకూడదని మనం ఆచరించినట్లే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే మరియు వినే వ్యక్తుల కోసం కూడా అదే ఆచరిద్దాం. ఇతరుల గురించి అన్ని రకాల గాసిప్‌ల నుండి, ఇతరులను అవమానించడం నుండి మనల్ని మనం రక్షించుకుందాం. ఏ రూపంలోనైనా గాసిప్‌లో పాల్గొనకూడదని మీరు నిర్ణయించుకుంటారు: అవాస్తవాలు, అర్ధ సత్యాలు, ప్రైవేట్ సత్యాలు, పుకార్లు మరియు తీర్పులు. కానీ మీ సోషల్ మీడియా వార్తలు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి, మీకు తెలియని వ్యక్తుల గురించి మరియు అపరిచితుల గురించిన కథనాలతో నిండి ఉంటుంది. మీరు వాటి నుండి ఉపసంహరించుకుంటూ బలమైన సామాజిక బంధాలను ఎలా కొనసాగిస్తారు? మనుష్యులు సోషల్ మీడియా ద్వారా పుకార్లు లేదా విమర్శలను ఎక్కువగా వ్యాపిస్తారు . అయితే వాటిలో పాల్గొనకుండా ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది వారి అభిప్రాయం, మనం వారి కథ, వారి సమస్య లేదా వారి పరిష్కారంలో భాగం కాదు. కాబట్టి, ఆ గాసిప్‌లో కూడా భాగం కానవసరం లేదు. ఒకరి ఇమేజ్ దెబ్బతీస్తున్నారు, ఎవరైనా విడాకుల కోసం దాఖలు చేస్తున్నారు లేదా ఎవరైనా ఉద్యోగం నుండి తొలగించబడ్డారు , అది వారి వ్యక్తిగత విషయం అంతే కానీ ఇతరులు చర్చించడానికి ఆహ్వానం కాదు. ధైర్యంగా, మర్యాదపూర్వకంగా, దృఢంగా మన అనాసక్తిని వ్యక్తపరుద్దాము. మన  సంభాషణ యొక్క దిశను కూడా మార్చవచ్చు. మనం ఎప్పుడైనా వ్యక్తుల గురించి మాట్లాడవలసి వస్తే, వారిని అభినందిద్దాం. లేకపోతే మనలో ప్రకాశం మరియు సమగ్రత క్షీణిస్తుంది. నేను స్వచ్ఛమైన జీవిని. నేను సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తాను, గాసిప్‌లకు దూరంగా ఉంటాను, నేను సమాచారాన్ని తెలివిగా ఎంచుకుంటాను అని ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి. 

స్వయాన్ని సరైన శక్తులతో సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని విజువలైజ్ చేసుకోండి. మీరు జ్ఞాని అని గుర్తు చేసుకోండి. మీకు ఏది సరైనదో అర్థం చేసుకోండి. సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి, చూడండి మరియు వినండి. మీ మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే గ్రహించండి. మీరు ఇతరుల గురించి సమాచారాన్ని చదివేటప్పుడు మరియు చూస్తున్నప్పుడు స్థిరంగా ఉండండి. పాజ్ చేసి, ఇది నిజమా లేక ఎవరి ఊహనా అని మిమల్ని మీరే ప్రశ్నించుకోండి. దాని కోసం నేను చేయగలిగినది ఏదైనా ఉందా? చేయగలిగినది ఉంటే, పాజిటివ్  దృక్పథాన్ని పంచుకోండి, నిర్మాణాత్మక అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఉద్దేశ్యం మెరుగుదల, సాధికారత మరియు గౌరవంతో మార్పును తీసుకురావడం కోసం అని నిర్ధారించుకోండి. మీ స్వచ్ఛమైన ఆలోచనలు మరియు మాటలతో పాజిటివ్ పరివర్తనకు సహకరించండి. మీరు చేయగలిగింది ఏమీ లేకపోతే మౌనంగా ఉండండి. మీ నిశ్శబ్ద మనస్సు మిమ్మల్ని, ఇతరులను, మరియు పర్యావరణం యొక్క ఆధ్యాత్మిక శక్తిని కూడా సంరక్షిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »