Hin

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

  1. నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ శాంతిని ప్రసరింపజేస్తాను … శాంతి సాగరుడైన పరమాత్ముడు, నాతో ప్రతి అడుగులో ఉన్నారు … వారు  నా ఆలోచనలు మరియు భావాలను శాంతితో నింపుతారు  … నేను శాంతియుత వాతావరణాన్ని తయారుచేస్తాను … 
  2. నేను శాంతి వైబ్రేషన్స్ తో కూడిన ప్రకాశవంతమైన శాంతి దూతను  … నేను శాంతియుతంగా నడుస్తాను మరియు మాట్లాడతాను … నేను ప్రతి ఒక్కరినీ శాంతిస్వరూపమైన సోదర ఆత్మలుగా చూస్తాను … నా పరస్పర చర్యలు శాంతి శక్తితో నిండి ఉన్నాయి … నా కుటుంబం, ఇల్లు మరియు కార్యాలయంలో శాంతియుతమైన పాజిటివిటీ  మరియు శాంతితో వచ్చిన మంచితనం కలిగి ఉన్నాయి  …
  3. నేను ఎల్లప్పుడూ నా భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న శాంతిస్వరూపాన్ని  … నా శరీరంలోని ప్రతి కణం శాంతితో మరియు ఉద్రిక్తత లేకుండా ఉంటుంది … దాని ఫలితంగా నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాను … నేను శాంతియుతమైన దృఢ సంకల్పంతో నా రోజును ఆరంభించి .. అదే శాంతియుతమైన దృఢ సంకల్పం తో ముగిస్తాను …. మరియు రోజంతా శాంతి స్వరూపం అనే అనుభూతిని కొనసాగిస్తాను  … నేను నా చుట్టూ ప్రశాంతమైన ప్రకాశంతో(aura) నిద్రపోతాను …
  4. నేను శాంతి స్వరూపమైన జ్యోతిని … నేను కనుబొమ్మల మధ్యలో నన్ను చూసుకుంటున్నాను … నేను శాంతియుతంగా భగవంతుని స్మరణలో ఆహారాన్ని వండుకుంటాను … నేను తినే ప్రతిదానికీ శాంతి నా కళ్ళ ద్వారా ప్రసరిస్తుంది … నా ఆహారం శాంతితో  నిండిపోతుంది… నేను ఆహారం తినే ముందు, నేను కొన్ని సెకన్ల పాటు భగవంతుడిని స్మరించుకుంటాను  … ఆ సమయంలో నెగెటివ్ సంభాషణలు లేకుండా శాంతియుతంగా ఆహారం తీసుకుంటాను  …
  5. నేను ప్రపంచంలోని ఆత్మలందరికి  శాంతి యొక్క లైట్ హౌస్ ను … నేను పరంధామం లో భగవంతుడిని  మరియు ప్రపంచ భూగోళాన్ని నా ముందు రోజులో చాలాసార్లు విజువలైజ్ చేస్తాను  … నేను భగవంతుడి  నుండి శాంతి కిరణాలను నింపుకుంటున్నాను  మరియు ప్రపంచంలోని ప్రతి దేశంలోని ప్రతి ఆత్మకు శాంతి యొక్క వైబ్రేషన్స్ అందిస్తాను  … ప్రతి ఆత్మ నా శాంతి శక్తి ద్వారా భగవంతుడి తో కనెక్ట్(connect) ఆవుతారు …

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »