HI

ప్రతిరోజూ ఒక విలువను తీసుకుని ఉపయోగించండి

ప్రతిరోజూ ఒక విలువను తీసుకుని ఉపయోగించండి

మన రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి సన్నివేశం మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేందుకు అనేక ఎంపికలను అందిస్తుంది. ఒక్కో దానిలో మనం తీసుకునే నిర్ణయం మనలోని విలువలకు అద్దం పడుతుంది.  శ్రద్ధ, సహనం, చిత్తశుద్ధి లేదా కృతజ్ఞత ఏదైనా కావచ్చు – విలువలు దిశను సూచిస్తాయి మరియు జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు మన విలువలకు అనుగుణంగా ఉంటే, మనం సుఖంగా ఉంటాము. కానీ ఏదైనా కారణం చేత మనం రాజీ పడితే, వైదొలిగితే లేదా విలువలను వదులుకుంటే, ముందైనా లేక తర్వాత అయినా మనం చింతిస్తాము.  నైతిక జీవనాన్ని విశ్వసించే వ్యక్తిగా, మీరు విలువల దిక్సూచిని సృష్టించి, మీ ఎంపికలు మరియు నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసేందుకు దాన్ని ఉపయోగించండి. కానీ మీరు ప్రపంచంలోకి బయలుదేరినప్పుడు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వారి విలువలపై రాజీ పడడాన్ని మీరు గమనించవచ్చు. ఆ క్షణాల్లో, మీది వదులుకోవడానికి మీరు టెంప్ట్ అవుతారా? మీరు ఎవరితో కలిసి జీవిస్తున్నారో, వారిలో ఆ విలువలు లేనందున మీరు ఏదైనా విలువను వదులుకున్నారా? విలువలే మన బలం. మన చుట్టుపక్కల ఎవరూ వాటిని ఉపయోగించనప్పటికీ, అవి పని చేయవని ఇతరులు విశ్వసించినప్పటికీ, మనం వాటిని వదులుకోకూడదు. కానీ తరచుగా మన ప్రవర్తన ఇతరులు మనతో ప్రవర్తించే విధానాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఈ ప్రక్రియలో మన స్వంత విలువలు కోల్పోతాయి. జీవన విలువలు అంటే మన సూత్రాల వర్ణపటాన్ని స్థిరంగా బలోపేతం చేయడం మరియు ప్రతిసారీ వాటిని అందరితో ఉపయోగించడం. ప్రలోభాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మన విలువలను పట్టుకోవడం మన శక్తిని పెంచుతుంది. విలువలు ఎల్లప్పుడూ మన అన్ని ఎంపికలు మరియు నిర్ణయాలలో ఉండాలి. అలా కాకుండా మనం వాటిని సౌకర్యం కోసం మాత్రమే ఉపయోగిస్తే, మన విలువలు వాటి విలువను కోల్పోతాయి. ఏదైనా ఒక విలువను ఎంచుకోండి, తదుపరి 24 గంటల పాటు, ఆ విలువ మీరు ఎవరో మరియు మీరు ఏమి చేస్తున్నారో ప్రతిబింబించేలా చేయడానికి కట్టుబడి ఉండండి. దీన్ని సర్వదా, సర్వులతో ఉపయోగించండి. మీరే గుర్తు చేసుకోండి – నేను ప్రతిరోజూ ఒక విలువను ఎంచుకుంటాను. నా ప్రతి ఆలోచన, మాట మరియు ప్రవర్తనలో నేను దానిని ఉపయోగిస్తాను. నా విలువలు నన్ను నిర్వచిస్తాయి. ప్రతి సన్నివేశంలోనూ వాటిని ఉపయోగిస్తూ నా వ్యక్తిత్వాన్ని బలపరుచుకుంటాను.

మీరు ఎంచుకున్న విలువ ప్రవర్తనా నియమావళి లాగా మారుతుంది, ఇది మీకు మరింత మెరుగ్గా మరియు ఇంకా మెరుగ్గా మారడంలో సహాయపడుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మరియు పరిస్థితులకు మీరు భిన్నంగా తయారవుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th feb 2024 soul sustenance telugu

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయరు

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధపెట్టాలని అనుకోరు. వారి స్వభావం మరియు అలవాట్ల ద్వారా వారు ఆ  ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్నిసార్లు, ఇతరులు ద్రోహం చేయవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు, అది

Read More »
23rd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 4)

సత్యత యొక్క శక్తి లేకుండా క్షమించే ప్రపంచం సృష్టించబడదు. శాంతి మరియు ప్రేమ మన భావోద్వేగాలను మార్చినప్పటికీ, బలమైన ఆత్మగౌరవం లేకుండా మనకు అన్యాయం చేసిన వ్యక్తిని మనం క్షమించలేము లేదా వారిపై కోపం

Read More »
22nd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 3)

కోపాగ్ని ఉన్న ఇంటిలో నీటి కుండలు కూడా ఎండిపోతాయని భారతదేశంలో ఒక సామెత ఉంది. కోపం మానవ స్పృహలో ఉన్న చాలా కోరికల యొక్క సేకరణ కారణంగా మనల్ని క్షమించనివ్వకుండా నిరోధించడానికి ఇవ్వబడిన పేరు.

Read More »