31st jan soul sustenance telugu

నా దృఢతతో నేను నా వలె ఉండటం

కొన్ని రోజులు మనం చాలా ఫ్రెష్ గా, ఉత్సాహంగా మేల్కొంటాం. మొత్తం రోజంతా అదే దశలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటాం. మనల్ని మనం విజయవంతంగా ఊహించుకుంటాం మరియు భంగం కలగకుండా చూసుకుంటాము. కానీ కేవలం కొద్ది క్షణాల తరువాత ఒక సంగటన కారణంగా మన కోపం లేదా అహం పూర్తిగా మనల్ని స్వాధీనం చేసుకుంటుంది. మన శాంతి మరియు స్థిరత్వం యొక్క అంతరంగ వాగ్దానాన్ని నాశనం చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆ దృశ్యం మన ముందుకు వచ్చింది అని అనిపిస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు మనం మన ఆహార పథ్యం పాటించడానికి నిర్ణయించుకుంటారు. కానీ అదే రోజు అత్యంత రుచికరమైన విందు లేదా ఇష్టమైన వంటకం వండుతారు, అందువలన మనం అతిగా తింటాము.

ఇలాంటి పరిస్థితులు ఒక్కోసారి మన సంకల్ప శక్తిని సవాలు చేస్తాయి. మొదటిసారి మనం దానికి లొంగిపోతాము , దానితో మనం శాశ్వతంగా ఓటమిని అంగీకరిస్తాము. నేను స్థిరంగా ఉంటాను అని మనకు మనం చెప్పుకునే బదులుగా ఆ వైఫల్యం గురించి మిగిలిన రోజంతటిలో, మనం అతిగా ఆలోచిస్తాము మరియు మనలని మనం విమర్శించుకుంటాము , దానితో మన ఆత్మిక శక్తి మరింతగా క్షీణిస్తుంది. మన సహుద్యోగులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా చర్చలలో అల్పమైన విషయాలలో తీవ్రంగా ప్రవర్తిస్తాము. ఈ విధంగా రోజు మొత్తం అలజడిలో గడిచిపోతుంది. కొన్ని చిన్న చిన్న కోపాలు మన శరీరంలో కెమికల్ రియాక్షన్ ఇవ్వడం వలన మన పని చేసే శక్తిని పెంచుతుందని కొందరు నమ్ముతారు. కానీ కోపం వలన కలిగే హాని గురించి శాస్త్రీయ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలు దెబ్బతీయడమే కాకుండా, కోపం వలన రక్తపోటు అధికమవుతుంది, రక్తనాళాలు మూసుకుపోవడం, నిద్రలేమి వంటి అనారోగ్యాలు, శరీర నొప్పులు, జీర్ణ రుగ్మతలు ఉత్పన్నమవుతాయి. మరికొందరు ఈ అహం శక్తిని ఇస్తుందని మరియు విజయాన్ని అందిస్తుందని నమ్ముతారు . నిజం చెప్పాలంటే అహం ఒక పెద్ద బలహీనత. అది ఆదేశానికి బదులుగా గౌరవాన్ని కోరుతుంది, కాబట్టి చివరికి మనుషులు మన నుండి దూరం అవుతారు మరియు మనం విజయాన్ని సాధించలేము. మన ఆలోచనలలో లేని భావోద్వేగాలు ఎక్కువగా పరీక్షించబడతాయి. కోపం మరియు అహంకారం పరీక్షించే వాటిలో అనింటికన్నా మొడటివి. దీని అర్థం మన చిత్తం కూడా పరీక్షించబడుతుంది అని .మన దృఢత శక్తి కూడా పరీక్షించి బడుతుంది. మనం మన ధృఢత శక్తిని ఎమర్జ్ చేసుకొని మన అంతర్గత వనరులు శాంతి, శక్తి, సంతోషాలను ఉపయోగించాలి. మనం ప్రతి ఒక్కరిని శుద్ధమైన ఆత్మలుగా చూడటానికి కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది . మన స్వచ్ఛత శక్తి ఇతరులను ప్రోత్సహిస్తుంది మరియు వారి మంచి లక్షణాలను వారు ఉపయోగించేలా చేస్తుంది. అంటే మన రోజు మంచిగా ఉండటమే కాకుండా మన శక్తి మరియు మన చుట్టూ ఇతర వ్యక్తులు కూడా శుద్ధంగా ఉండే విధంగా ప్రభావిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »
21st march soul sustenance telugu

21st March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 2) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలు: ఆంతరిక మౌనము మరియు ఏకాగ్రతా శక్తి –

Read More »