Hin

పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 1)

పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 1)

పాజిటివిటీ మన స్వభావం అయినప్పటికీ మన బిజీ జీవనశైలి లో కొన్నిసార్లు దానిని  కోల్పోతాము.  ఇది మన మెడలో హారం వంటిదని గుర్తించని కారణంగా దాని కోసం మనం వెతుకుతాము. మనం రోజును ప్రారంభించినప్పుడు, పాజిటివ్ సమాచారంతో మన మనస్సులను నింపుకోవాలి. ఈ పాయింట్లు మన మనస్సును బలపరచి మన చుట్టూ ఉన్న నెగెటివిటీ నుండి కాపాడతాయి. మెడలో హారంలా పాజిటివిటీ కూడా తాత్కాలికంగా పోయినప్పటికి తిరిగి పొందడం చాలా సులభం, కానీ పాజిటివిటీని తిరిగి పొందే మార్గాల గురించి నెగెటివ్ ప్రభావం నన్ను ఆలోచించనివ్వదు.

అనగనగా ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను రోజంతా చిన్న చిన్న కారణాల వల్ల కలత చెందేవాడు.  ప్రతి రోజు అతను ఈ రోజంతా ఏ  కఠిన పరిస్థితి వచ్చినా తన మనస్సును ప్రభావితం చేయనివ్వనని తనకు తాను వాగ్దానం చేసుకునేవాడు. కానీ, అతను తన వ్యాపారంలో పడగానే, అతను ఏదో ఒక సమస్యకు బలైపోయేవాడు. ఈ సమస్యలు తను చేసే పని నుండో, ధనం ద్వారానో, పనివాళ్ళ నుండో లేదా కొన్నిసార్లు తన మానసిక స్థితి  కారణంగానో తలెత్తుతుండేవి. కష్టాలకు తేలికగా లొంగిపోయే మనస్సును ఒక ఇంటితో పోల్చవచ్చు, అక్కడ చిన్న ఎలుక రూపంలో ఒక చిన్న సమస్య ప్రవేశించి మొత్తం ఇంటిని కలవరపెడుతుంది. ఇంటి యజమాని ఎలుకను వదిలించుకుని, అంతా బాగానే ఉందని భావించేలోపే, ఒక పిల్లి ప్రవేశించి, ఆ కష్టాలను పెంచుతుంది, ఇంటి యజమాని దానిని తన ఇంటి నుండి బయటకు తీసే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాడు. పిల్లి తరువాత కుక్క ప్రవేశిస్తే ఇంటి యజమాని రోజంతా అదే ప్రయత్నంలో గడుపుతాడు. కథ యొక్క నీతి ఏమిటంటే – కలవరపడే వ్యక్తి సమస్యలను దూరంగా ఉంచడానికి ప్రయత్నించి ఆటంకాలను ఆకర్షిస్తాడు. సమస్యలను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ అందులోనే నిమగ్నమైన వ్యక్తి యొక్క మనస్తత్వం క్రమంగా మరిన్ని సమస్యలను ఆకర్షిస్తుంది. కాబట్టి, రోజులో మొదటి సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి, దానిని దూరం చేసే ప్రయత్నంలో ఎక్కువగా నిమగ్నమై కంగారు  పడకండి. రోజంతా సమస్యలను దూరంగా ఉంచడానికి ఇది మొదటి మెట్టు. ప్రశాంతత, నా చుట్టూ సమస్యలు లేని వాతావరణాన్ని సృష్టించి నన్ను సంతృప్తిగా, శక్తివంతంగా మరియు శాంతియుతంగా ఉంచుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »