Hin

వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 1)

వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 1)

ప్రతి ఒక్కరి పట్ల మన వైఖరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మరియు ప్రతి ఒక్కరిని మనం ఎలా చూస్తాము అనేదే మన జీవితంలోని అందమైన అంశం. ఒక వ్యాపారవేత్త తన కృషి మరియు అంకితభావం కారణంగా తన రంగంలో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా పేరు పొందాడు. వేలాది మంది అతనిని అభిమానించారు మరియు గౌరవించారు. ప్రతి ఒక్కరి వైఖరి అతని పట్ల చాలా బాగుంది మరియు పాజిటివ్ గా ఉంది. అతను తన కెరీర్ మధ్యలో ఎప్పుడో రాణించలేకపోయాడు , అకస్మాత్తుగా అందరూ  అతని నుండి దూరం కావడం ప్రారంభించారు. అతని పట్ల చాలా మంది వ్యక్తుల వైఖరి నెగిటివ్ గా మారడం ప్రారంభించింది.  అతని విజయంలో, అతనితో సంతోషంగా ఉన్న అదే వ్యక్తులు, అతని జీవితంలో కఠిన  పరిస్థితుల్లో తోడు లేరు. ప్రపంచం అతని వైపు వెను తిరిగింది. తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అతను ఎందుకు అలాంటి ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు? అతనిలో ఏదయినా లోపించిందా? అతను ఏదైనా తప్పు చేశాడా? అస్సలు కాదు. కానీ ప్రపంచం అతని పట్ల అలా ఉంది. నెగిటివ్ వైఖరిని కలిగి ఉన్నది. ప్రతి ఒక్కరి పట్ల మన వైఖరి కేవలం పాజిటివ్ గా ఉండటమే కాకుండా సదా పాజిటివ్ గా ఉండాలి అంటే నిరంతరం పాజిటివ్ గా ఉండాలని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతోంది.

ప్రతి ఒక్కరి పట్ల మనం ఎల్లప్పుడూ పాజిటివ్ వైఖరితో ఉండగలమా? ఎల్లప్పుడూ పాజిటివ్ వైఖరితో ఉండనివ్వకుండా మనల్ని ఏది ఆపుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందరి పట్ల మన వైఖరి చాలా సులువుగా మారుతుంది. ఉదాహరణకు A మరియు B అనే ఇద్దరు వ్యక్తులు పరస్పరం సంభాషించుకుంటున్నారు అనుకోండి. B అనే వ్యక్తి C గురించి A కు నెగిటివ్ గా వివరించి వెళ్ళిపోయాడు. తరువాత అదే రోజున, C సహాయం కోసం A దగ్గరకు వస్తాడు మరియు A అనే వ్యక్తి C మంచి వ్యక్తి కాదని భావించి సహాయం చేయడానికి నిరాకరించాడు. ఈ చర్యకు బాధ్యులెవరు? B మరియు అతను A కు , C గురించి అందించిన అతని నెగిటివ్ అభిప్రాయం. ఇది C పట్ల A యొక్క వైఖరిని మార్చింది. ఇది మన సామాజిక వర్గాల్లో లేదా మన కార్యాలయాల్లో లేదా మన కుటుంబాల్లో కూడా జరగవచ్చు. వైఖరి ముఖ్యం. ఇది అన్ని సంబంధాలకు పునాది రాయి. రాబోయే రెండు రోజుల సందేశాలలో దాని గురించి ఆలోచించుకుందాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »
22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »