3rd april soul sustenance telugu

సుప్రీమ్ స్టార్ మనపై ప్రకాశిస్తున్నారు (పార్ట్ 3)

మన జీవితంలో అడుగడుగునా మంచి మరియు సానుకూలత  కోసం చూస్తున్నాము. మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు చుట్టూ ఉన్న వారందరినీ జాగ్రత్తగా గమానించారా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యంతో తమ జీవితాన్ని గడుపుతున్నారు. కొంతమంది సంపద , మంచి కుటుంబం లేదా మంచి డిగ్రీ లేదా మంచి ఉద్యోగం యొక్క లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ స్వల్పకాలిక లక్ష్యాలే. అవి మనుష్యులకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ, అవి మిమ్మల్ని శాశ్వతంగా సంతోషపెట్టవు. మీరు దేనికి  హడావిడి మరియు ఆత్రుతతో వెనుక పడుతూ వచ్చారో, అవి తరువాత మీ వద్దకు తిరిగి వచ్చి మీరు ఈ విషయాల వెనుక పడుతున్నారు కానీ మీరు మీ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరచిపోయారు అని మీకు చెప్పవచ్చు. నా జీవితంలో మొదటి మరియు నిజమైన ఉద్దేశ్యం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా ఆంతరిక సంపన్నత ద్వారా  శాంతి, ప్రేమ మరియు ఆనందాలకు మూలంగా అవడం  .  ఉద్యోగం వచ్చి పోతుంది, డబ్బు కొన్నిసార్లు పెరుగుతుంది మరియు కొన్నిసార్లు తగ్గుతుంది. కుటుంబ సభ్యులు నాకు ఇంతకు ముందు సంతోషాన్ని ఇచ్చేవారు కానీ ఇప్పుడు వారితో నా సంబంధాలలో నేను కష్టపడుతున్నాను.  డిగ్రీ నా కెరీర్‌కి మంచి ఆరంభాన్ని ఇచ్చింది, కానీ నా కెరీర్ మధ్యలో ఎక్కడో ఏదో లోటుగా అనిపించింది. నేను నా స్నేహంలో రాణించాను, కానీ నేడు ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవితం ఉండడం వలన నా మాట వినడానికి సమయం లేదు లేదా నన్ను అర్థం చేసుకోలేరు. నాకు  ఒంటరిగా అనిపిస్తుంది. నేను ఒక్కప్పుడు విజయానికి మారు పేరు కానీ ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణించింది. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? తప్పుడు జీవిత లక్ష్యాలు!

అంటే ఈ తాత్కాలికమైన నిత్యం మారిపోయే, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించని భౌతిక విషయాలన్నింటికీ వెనుక  నా అసలు ఉద్దేశ్యం ఏమిటి? శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తిగా ఉండడం , ఇవి లోపల నుండి వచ్చేవే కానీ నా స్నేహితులు, వృత్తి, క్రీడలు, విద్య మరియు కుటుంబ సభ్యుల నుండి కాదు. అప్పుడు, తదుపరి దశ ఏమిటి? అసలు ఏం నేను సాధించాలి ?  శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క ప్రతి ఒక్కరి కోరికను నెరవేర్చాలి , కానీ భౌతిక మార్గాల ద్వారా కాదు. వాటిని శాశ్వతమైన అంతరికతతో నెరవేర్చాలి. మరి ఇది చేయడానికి నాకు ఎవరు సహాయపడతారు? నా తండ్రి … ఆత్మ నైన నాకు తండ్రి, … మనందరి తండ్రి … వారు మనపై ప్రకాశిస్తున్న సుప్రీమ్ స్టార్ మరియు వారి ప్రేమ మరియు సహాయంతో ఎల్లప్పుడూ మనల్ని ఈ లక్ష్య సాధన కోసం నడిపిస్తున్నారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »