Hin

విశ్రాంతి తీసుకొని, రిఫ్రెష్ అయి మీ మనస్సును చైతన్య పరుచుకోండి.

విశ్రాంతి తీసుకొని, రిఫ్రెష్ అయి మీ మనస్సును చైతన్య పరుచుకోండి

మన మనస్సులో ఆలోచనల ప్రవాహం నెమ్మదించాలని మనం కోరుకుంటాము. ప్రతిరోజూ 40,000 నుండి 50,000 ఆలోచనలు ఉత్పన్నమవుతూ, వాటిలో చాలా వరకు నెగెటివ్ లేదా వేస్ట్ ఉండడంతో మన మనస్సు అలసిపోతుంది. అది ఫోకస్ చేయడం, సరైన పదాలను ఉపయోగించడం లేదా పాజిటివ్ గా ఉండడం కష్టంగా చేస్తుంది.

మీ మనస్సుకు విశ్రాంతిని ఇచ్చి, రిఫ్రెష్ చేసుకొని చైతన్య పరుచుకోవడానికి  ఈ విధానాలను అనుసరించండి –

  1. ప్రతి ఉదయం, మీ శరీరం, సంబంధాలు, పని వంటి ప్రతిదాన్ని మేనేజ్ చేస్తున్నందుకు మీ మనస్సుకు ధన్యవాదాలు చెప్పండి.
  2. 15 నిమిషాల మెడిటేషన్తో దానిని శక్తివంతం చేయండి. శాంతి మరియు ఆనందంతో ప్రభావం  చేసే కంటెంట్‌ను చదవండి.
  3. మీ రోజు ఎలా ఉండాలో సంకల్పం చేసి దాన్ని విజువలైజ్ చేసుకోండి.
  4. మీ పనిలో, వ్యక్తులు మరియు పరిస్థితులలో పాజిటివ్ విషయాల పై మాత్రమే దృష్టి పెట్టండి.
  5. ప్రతి గంట తర్వాత ఒక నిమిషం పాజ్ చేసి మీ మనస్సుకు విశ్రాంతినిస్తూ నెగెటివిటీ లేకుండా క్లీన్ చేసుకోండి.
  6. మంచి నిద్ర కోసం నిద్రపోయే ముందు మెడిటేషన్ చేసి మీ మనస్సులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోండి.

మీ మనస్సుతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు క్లీన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా ఈ సంకల్పాలను 3 సార్లు రిపీట్ చేయండి.

నేనొక శక్తివంతమైన జీవిని … నేను నా మనస్సును జాగ్రత్తగా చూసుకుంటాను … నేను ప్రతిరోజూ ఉదయం 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను … నేను పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నాను … నేను నా రోజును నేను కోరుకున్న విధంగా ఉంటూ అనుకున్నవి  చేస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తాను… నేను 15 నిమిషాలు చదువుకుంటాను … ప్రతి పరిస్థితికి నేను సరిగ్గా స్పందిస్తాను … మీడియా, సోషల్ మీడియా మరియు వ్యక్తుల నుండి నెగెటివ్  సమాచారానికి నేను దూరంగా ఉంటాను  … ప్రతి గంటలో ఒక నిమిషం నేను పాజ్ అవుతాను … నా మనస్సుకు విశ్రాంతి ఇవ్వడానికి … నేను నిద్రపోయే ముందు మెడిటేషన్ చేస్తాను … అది నా మనస్సును చార్జ్ చేస్తుంది. 

మీరు మీ ఆలోచనలకు బాధ్యత వహించి, వాటిని నియంత్రించడం మొదలుపెడితే, మీ మనస్సు సహజంగానే నెమ్మదించి ప్రతి పరిస్థితిలోనూ సరిగ్గా ఆలోచిస్తుంది. వ్యక్తులు మరియు పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించడానికి, మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడమే మొదటి అడుగు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »
14th june2024 soul sustenance telugu

వినయంగా ఉంటూ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వండి

ప్రతి సమాజం మరియు ప్రతి కుటుంబం కూడా ప్రవర్తనలో కొన్ని నియమాలను పాటిస్తుంది. వ్యక్తుల పాత్రలు, పదవుల ఆధారంగా వారిని గౌరవించడానికి ఆ నియమాలు మనకు ప్రవర్తనా నియమావళిగా పనిచేస్తాయి. నిర్దిష్ట పాత్రలలో ఉన్న

Read More »
13th june2024 soul sustenance telugu

సంతోషాన్ని సరిగ్గా జీవించడం (పార్ట్ 3)

సంతోషం అనేది బాహ్య ప్రభావాలపై ఆధారపడినది మానసిక స్థితి. ఉదా. మీరు ఒక గొప్ప వార్త వింటారు – మీ కార్యాలయంలో మీకు ప్రమోషన్ వచ్చింది. ఇది వినడానికి చాలా బాగుంటుంది, మీకు సంతోషాన్ని

Read More »