3rd feb soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మముడి(భాగం 3)

ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు మీ దినచర్యలో ఉన్నప్పుడు కూడా చేసేటువంటిది. వాస్తవానికి, ఇది రోజులోని అన్ని పాజిటివ్ కర్మలకు గట్టి పునాది. మీ పాజిటివ్ ఆలోచనలు మరియు మెడిటేషన్ యొక్క దివ్యమైన బొడ్డు తాడు ద్వారా మీ ఆత్మిక తల్లి లేదా పరమాత్ముని నుండి ఏడు దివ్య గుణాలతో స్వయాన్ని నింపాలి. అప్పుడే మీరు ఇతరులకు అవే సుగుణాలను ప్రసరింపజేస్తారు. తరచుగా, రోజులో నెగిటివ్ కర్మలు జరగడానికి ముఖ్య కారణం ఆ పరమాత్మునితో దివ్యమైన పవిత్రమైన కనెక్షన్ దృఢంగా ఉండకపోవడం. మరో మాటలో చెప్పాలంటే,మెడిటేషన్ అనే బొడ్డుతాడు కట్ అవ్వడానికి కారణం మనం మన కర్మలలో చాలా బిజీ అవుతూ పరమాత్మున్ని మర్చిపోవడం.అలాగే, మనం మన దినచర్యలో నిమగ్నమై, కర్మలు చేస్తున్నప్పుడు, ఉదయం ధ్యానంలో మనకు ఏర్పడిన బలహీనపడుతుంది. కాబట్టి, ఇతరులు మన నుండి మంచిని పొంది తిరిగి మనల్ని ప్రేమించాలంటే, రోజంతా ఆత్మికత అనే గుహలో ఉండి, భగవంతుని నుండి దాని ప్రయోజనాలను గ్రహించడం చాలా అవసరం.

అలాగే, ఈ సుందరమైన మరియు పవిత్రమైన భగవంతుని ఒడి మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది. సమయం గడిచేకొద్దీ, ధ్యానం చేయడం మరియు మన ఆత్మిక స్పృహను ఆయనపై కేంద్రీకరించడం ద్వారా మనం మంచి మానవులుగా అవుతాము. మనమందరం ఆయనను తండ్రిగా ప్రేమిస్తాము. కానీ వారు ఆత్మలందరి తల్లి. ఈ తల్లిలో అనంతమైన శాంతి, ప్రేమ మరియు శక్తితో నిండి ఉన్నాయి. భౌతిక తల్లి యొక్క ఈ ప్రత్యేకతలు మనమందరం పెరిగిన మరియు అనుభవించిన వారినే. ప్రపంచంలోని అత్యంత సుందరమైన మరియు స్వచ్ఛమైన సంబంధాలలో తల్లి పిల్లల సంబంధం. కాబట్టి, భగవంతుడు ఆత్మకు తల్లి. ఆత్మిక సంతానమైన నా పట్ల వారి ప్రేమ బిడ్డ అయిన నా పట్ల వారి ప్రేమ ప్రపంచంలోనే అత్యున్నతమైనది. కాబట్టి, ఈ అత్యంత సుందరమైన మరియు ప్రేమగల అవినాశి తల్లి యొక్క సహవాసాన్ని ఆనందించండి. అంటే ధ్యానంలో భగవంతుని స్మరించండి మరియు ఆయన ప్రేమను మరియు మంచితనాన్ని మొత్తం విశ్వానికి ప్రసరింపజేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »