Hin

3rd July 2023 Soul Sustenence Telugu

సంతోషకరమైన ప్రపంచం కోసం 5 సహయోగ విధానాలు (పార్ట్ 3)

  1. అభిప్రాయాల భేదాలను పరిష్కరించుకొని పాజిటివ్గా ఐక్యమత్యంగా శక్తిని వ్యాప్తి చేయండి – చాలా సార్లు వ్యక్తుల మధ్య నెగెటివ్ ఎనర్జీ అడ్డంకులు ఉంటాయి, ఇవి ఆనందం మరియు సద్భావనను కొనసాగించనివ్వవు. చాలా సార్లు ఇది ఒకరికొకరు పట్ల శుభాభవనాలు లేకపోవడం అనగా  ఇతరులకు వ్యతిరేకంగా లేదా ముఖ్యంగా వారి వెనుక మాట్లాడటం. ఇది నెగెటివ్ స్వభావం అయిన కారణంగా స్నేహితులు లేదా బంధువులు లేదా కార్యాలయ సహోద్యోగుల యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని పాడుచేస్తుంది. 

మీ గ్రూపులోని ప్రతి వ్యక్తి యొక్క మంచితనాన్ని ప్రస్తావిస్తూ, వారికి అనుగుణంగా మంచితనం యొక్క ఒక అడుగు వేయండి, ఆనందాన్ని పంచండి. సంతోషం అనే బహుమతి అన్నింటికన్నా ఉత్తమమైన బహుమతి అని అంటారు. అలాగే, మీ గ్రూపులోని ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను గ్రూపు మొత్తానికి ప్రస్తావించి గ్రూపులోని ప్రతి వ్యక్తికి అందరి హృదయాలలో ఆనందాన్ని కలిగించే మాధుర్యం మరియు ప్రేమ యొక్క పాజిటివ్ శక్తిని వ్యాప్తి చేయండి. అలాగే, అభిప్రాయ భేదాలు ఐక్యతను ఏర్పరచడంలో అవరోధంగా ఉండనివ్వవద్దు. స్వభావాలు భిన్నమైనప్పటికీ ఐక్యంగా ఉండండి. ఇది సంబంధాలను ఆనందంగా మరియు తేలికగా చేస్తుంది మరియు మీ గ్రూప్ శక్తిని పాజిటివ్ ఉత్సాహంతో నింపుతుంది.

  1. ప్రపంచ ఆనందాన్ని కలిగించే ఏ పనికైనా సహకరించండి – చాలా సార్లు మనం కేవలం వృత్తి మరియు కుటుంబ సంరక్షణలో భాగంగా మనం చేసే పనుల మధ్య, ఒక ఉన్నతమైన ప్రయోజనం గుర్తించము. గుర్తించని కారణంగా కొన్నిసార్లు మన మరియు మనతో ఉన్నవారి జీవితాలలో సంతోషం యొక్క అనుభవం ఉండదు. ఈ రోజు ప్రపంచ ఆనందాన్ని కలిగించే ఒక పనిని ఎంచుకుని, ప్రతిరోజూ ఆ పనికి కొన్ని నిమిషాలు కేటాయించండి. ఈ పనిలో భాగంగా, అందరితో మమేకమై వారికి ఆనందాన్ని అందజేయండి మరియు స్వీకరించండి. అలాగే, ఈ పని ద్వారా చాలా మంది ముఖాల్లో చిరునవ్వులు నింపండి. ఇది సంతోషకరమైన ప్రపంచానికి పునాదిని సృష్టిస్తుంది. ఎందుకంటే, మనమందరం కలిసి ఒక సంఘంగా కలిసి సంతోషంగా జీవించాలి, ఆపై ప్రపంచం సంతోషంగా మారుతుంది, తేలికతనము మరియు సంతృప్తితో నిండి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అన్ని పరస్పర చర్యలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకురండి మనమందరం రోజంతా చాలా మంది వ్యక్తులతో సంభాషిస్తాము. మన మరియు వారి ఆలోచనలు,

Read More »
17th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు స్వీయ మార్పు కోసం స్వీయ బాధ్యత తీసుకోండి శక్తి మార్పిడులు సాధారణంగా మనం స్వీయ మార్పు పట్ల ఎలా మన దృష్టికోణం

Read More »
16th June 2025 Soul Sustenance Telugu

ఇతరులతో శక్తి మార్పిడి యొక్క నాణ్యతను మెరుగుపరచడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ నాటకంలో మనం అనేక జన్మలలో అనేక రకాల వ్యక్తులను కలుస్తాం. ప్రతి జన్మలో వారి సౌరభం మరియు వారు ప్రసరించే

Read More »