మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను ఏర్పరుచుకొని, మన అంచనాలకు మానసికంగా జోడించబడతాము. మనమందరం మంచి వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటాము, అయినప్పటికీ మనము కంఫర్ట్ జోన్‌ (comfort zone) లో స్థిరపడతాము మరియు మార్పులను నిరోధిస్తాము. మార్పులను స్వీకరించే సుముఖత, జీవితం ఇంకా ఏమి అందిస్తుందో తెలుసుకోవాలనే ఉత్సాహం మరియు ఉత్తమమైన వాటిని మాత్రమే విశ్వసించడం, మన సామర్థ్యం వైపు వెళ్లడానికి మనకు సహాయపడతాయి.

  1. మార్పులు మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం, వాటిని విశ్వసించడాన్ని ఎంచుకోండి. భగవంతుని ప్రేమను విశ్వసించండి, మిమ్మల్ని మీరు విశ్వసించండి, ప్రజలను విశ్వసించండి మరియు ప్రతి సన్నివేశాన్ని విశ్వసించండి. జీవితం అందంగా ఉంటుందని నమ్మండి. ఇది మీ పరిస్థితుల నుండి పాజిటివ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
  2. రోజూ మెడిటేషన్ చేయండి. ఇది మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. వ్యక్తులు లేదా పరిస్థితులు మీరు అనుకున్న విధంగా లేనప్పటికీ, మీ మనస్సు పరిపూర్ణంగా ఉంటుంది. మీరు మార్పును వెంటనే అంగీకరించగలుగుతారు, ఎమోషన్స్(emotions) కు  అతీతంగా ఉందగలుగుతారు, సరిగ్గా ఆలోచించగలుగుతారు, మీ వివేకాన్ని సంప్రదించి సరిగ్గా స్పందించగలుగుతారు.
  3. మీరు ఎవరు మరియు మీ వద్ద ఉన్నదానికి ప్రతి ఉదయం కృతజ్ఞతలు తెలియజేయండి. కృతజ్ఞత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది ఫిర్యాదు లేదా నిందించే ధోరణులను కూడా ఆపివేస్తుంది.
  4. మార్పులు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటాయి. అవి సవాలుగా ఉన్నప్పటికీ – ఆరోగ్య సమస్యలు, చెదిరిన మనస్సు, సంపద హెచ్చుతగ్గులు లేదా సంబంధాలలో సంఘర్షణలు, మీరు పరిస్థితి వల్ల బలంగా అవుతారు. అది భారీ ప్రయోజనం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »