3rd march soul sustenance telugu

విజయానికి 8 శక్తులు (భాగం 5)

నిన్నటి మెసేజ్‌లో, రోజు యొక్క మొదటి అడుగు అయిన దృఢ సంకల్పం మరియు రోజంతటిపై దాని పరిణామం యొక్క ప్రాముఖ్యతను వివరించాము. అయితే అష్టశక్తులను ఆచరణలోకి తీసుకురావడానికి దృఢ సంకల్పంతో పాటు ఆధ్యాత్మిక శక్తి మరియు జ్ఞానం కూడా అవసరమని గమనించడం ముఖ్యం. శక్తి అనేది ఆత్మ యొక్క అంతర్గత సామర్ధ్యం ఉద్భవించి, ఈ శక్తులను కార్యరూపంలోకి తీసుకురావడం. మరోవైపు జ్ఞానం అంటే, ఏ శక్తి ఎప్పుడు అవసరమో తెలుసుకోవడం, ఇంకా ముఖ్యంగా ఆ శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడం. జ్ఞానం మరియు శక్తి రెండూ సమాన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

ఆధ్యాత్మికత ద్వారా జ్ఞానం నేర్చుకుంటారు. ఆధ్యాత్మికత ఆత్మ యొక్క పూర్తి జ్ఞానం మరియు ఎలా పని చేస్తుంది అని తెలుపుతుంది . దానితో పాటు కర్మ యొక్క జ్ఞానం అంటే కర్మల లోతైన రహస్యం కూడా తెలుపుతుంది. అంటే ప్రతి మంచి లేదా చెడు కర్మ పాజిటివ్ లేదా నెగెటివ్ ఫలితాన్ని కలిగిస్తాయి, దానినే ఆత్మ సంతోషం లేదా దుఃఖం రూపంలో అనుభవించవలసి ఉంటుంది. అలాగే, జ్ఞానం అంటే భగవంతునితో సంబంధంతో పాటు భగవంతుడు ఎవరు, మనం వారితో ఎలా కనెక్ట్ అవ్వవచ్చు, వారి నుండి అష్ట శక్తులతో మనల్ని మనం ఎలా నింపుకోవచ్చు అనే జ్ఞానం కలిగి ఉండడం. దానితో పాటు సృష్టి నాటకం యొక్క జ్ఞానం, జన్మ మరియు పునర్జన్మల చక్రంలోకి ఎలా వచ్చి, మన అష్టశక్తులను ఎలా కోల్పోతాము మరియు వాటిని ఎలా తిరిగి పొందగలము అనే జ్ఞానం. వాస్తవానికి, అష్టశక్తుల జ్ఞానం మరియు రోజువారీ జీవితంలో వాటి ఆచరణాత్మక ఉపయోగం యొక్క జ్ఞానం . ఆధ్యాత్మికత యొక్క ఈ అంశాలతో పాటు వాటి పూర్తి జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానాన్ని పొందేందుకు, మీరు మీ రోజువారీ జీవితాన్ని లేదా మీ గృహాలను వదిలివేయవలసిన అవసరం లేదు. ప్రొఫెషనల్‌గా ఉంటూ కూడా పొందవచ్చు. మరోవైపు, మీరు విభిన్న స్వభావాలతో విభిన్న రకాల వ్యక్తులను కలుసుకునే జీవన శైలిలో ఉన్నట్లయితే, మీకు ఆధ్యాత్మిక జ్ఞానం మరింత అవసరం. మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్థాయిలలో విభిన్న సంబంధాలతో నిండిన జీవితాన్ని గడుపుతుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి, కుటుంబంలో జీవించండి, ఆఫీసుకు వెళ్లండి, వ్యాపారం చేయండి కానీ దానితో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం లేదా చదవడం మర్చిపోవద్దు. ఎందుకంటే, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా, అష్ట శక్తులను ఎలా ఉపయోగించాలో మరియు మానసికంగా ఎలా విజయం సాధించాలో మీకు తెలియదు.
(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »
21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »