సిట్యుయేషన్ ప్రూఫింగ్ యువర్ సెల్ఫ్ (పార్ట్ 3)

సిట్యుయేషన్ ప్రూఫింగ్ యువర్ సెల్ఫ్ (పార్ట్ 3)

నిన్నటి సందేశంలో పేర్కొన్న ప్రశ్నలు మరియు ఆశ్చర్యార్థక గుర్తులు లేకుండా మీ చేతనాన్ని  చాలా కాలం పాటు ఉంచడమే సిట్యుయేషన్ ప్రూఫింగ్‌ యొక్క  నిర్వచనం. ఇది శక్తివంతమైన చేతనం  ఎందుకంటే ఇక్కడ  నెగెటివ్  లేదా వ్యర్థ ఆలోచనా విధానాలకు తక్కువ స్థానం ఇవ్వడం  జరుగుతుంది. అటువంటి పాజిటివ్ చేతనం ఉన్న వ్యక్తి పాజిటివ్ వృత్తి కలిగి ఉంటాడు. పాజిటివ్ దృష్టి కోణం సమస్యలపై మన అవగాహనను ప్రభావితం చేసి  దానిని పాజిటివ్ గా చేస్తుంది. చివరిగా మన ముందు ఉన్న సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పాజిటివ్ లేదా సరైన పదాలు మరియు కర్మలను మన ముందుకు తెస్తుంది.

కాబట్టి, సంక్షిప్తంగా, మన ఆలోచనలు మన అవగాహనకు పునాది. నెగెటివ్ అవగాహనలు నెగెటివ్ ఆలోచనల పునాదిపై నిలుస్తాయి. కొన్నిసార్లు ఇవి  ప్రశ్నలు మరియు ఆశ్చర్యార్థకాలు గా జీవితకాలం   ఉంటాయి. పాజిటివ్ అవగాహనలు సుదీర్ఘ కాలంలో సృష్టించబడిన పాజిటివ్ ఆలోచనల పునాదిపై నిలుస్తాయి. ఇది మీ జీవితంలో కఠిన పరిస్థితిని కలిగి ఉన్న సమయంలో పాజిటివ్ ఆలోచనలను సృష్టించడం గురించి మాత్రమే కాదు. ఇది చాలా సంవత్సరాలు  పాజిటివ్ ఆలోచనలను సృష్టించడం యొక్క అభ్యాసం,  లేదా కనీసం కొన్ని నెలలపాటు అభ్యాసం మనస్సును అత్యంత శక్తివంతం చేస్తుంది. ఇది అనేక విభిన్న నెగిటివ్  పరిస్థితులలో  మనస్సును శక్తివంతం చేసుకొని  అన్ని పరిస్థితులలో మనస్సును పాజిటివ్ గా ఉంచడంలో అనేక సార్లు విజయాన్ని సాధించి మనస్సును శక్తివంతం చేయడం. ఇది భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే పరిస్థితులలో మన అభిప్రాయాన్ని పాజిటివ్ గా మార్చి పాజిటివ్ గా ఉంచుతుంది. పాజిటివ్ ఆలోచనలు నెగెటివ్ ఆలోచనలు చేయడం అలవాటైన మనస్సు యొక్క బకెట్‌లో పోసిన స్వచ్ఛమైన నీరు లాంటివి. ఎందుకంటే  నెగెటివ్ ఆలోచనలు చేసే మనసు నెగెటివ్ ఆలోచనలను సృష్టించడానికి అలవాటుపడి ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు బకెట్‌లోని అపరిశుభ్రమైన నీరు వంటివి. నెగెటివ్ ఆలోచనలు అనే అపరిశుభ్రమైన నీరు పూర్తిగా పాజిటివ్ ఆలోచనలు అనే స్వచ్ఛమైన నీరుగా మారడానికి  పాజిటివ్ ఆలోచనలనే స్వచ్ఛమైన నీటితో మనసు అనే బకెట్‌లో పోయడం అవసరం. కాబట్టి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు పాజిటివ్  మరియు అందమైన ఆలోచనలను మీ మనస్సులో కురిపించండి మరియు మెడిటేషన్ తో   మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి. కొంత కాలానికి మిమ్మల్ని గందరగోళపరిచే మరియు మీ పాజిటివ్  అవగాహనను తగ్గించే ప్రశ్నలు మరియు ఆశ్చర్యార్థక గుర్తులు తొలగించబడతాయి. ఫలితంగా మీరు సిట్యువేషన్ ప్రూఫ్ అవుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »