4th april soul sustenance telugu

మెడిటేషన్ ద్వారా అందమైన జీవితానికి 5 మెట్లు

  1. సర్వోన్నతమైన శక్తితో మెడిటేషన్ చేసి మీ రోజును ప్రారంభించండి – రోజులో ఉదయం చాలా ముఖ్యమైనది. ఉదయం ప్రకృతి స్వచ్ఛంగా, ప్రపంచమంతా స్వచ్ఛమైన వైబ్రేషన్స్ తో ఉంటుంది. ఈ సమయంలో, మేల్కొని సర్వోన్నతమైన శక్తి అయిన భగవంతునితో 15 నిమిషాలు కనెక్ట్ అవ్వండి. వారి  సుందరమైన గుణాలతో మరియు శక్తులతో మిమ్మల్ని మీరు నింపుకోండి.
  2. ఫిజికల్ యోగా చేసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి – అందమైన మరియు ఆరోగ్యకరమైన మనస్సు మరియు శరీరం కోసం, శారీరిక వ్యాయామం చేయండి లేదా కొన్ని నిమిషాలు నడవండి. మీ శరీరాన్ని స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో నింపండి. ఇది మన శ్రేయస్సు కోసం చేసే శారీరక యోగా. మీ శరీరంలో ప్రతి అవయవానికి మరియు ప్రకృతికి భగవంతుని స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ను ప్రసరింపజేయండి.
  3. తయారు అయ్యి భగవంతుని జ్ఞానంతో యోగాన్ని జోడించండి – ఉదయాన్నే శారీరక యోగా తర్వాత, మరో 15 నిమిషాల పాటు భగవంతుని జ్ఞానం చదవండి లేదా వినండి. ప్రతి పదం లోతుల్లోకి వెళ్లి దాని సారాన్ని గ్రహించి ప్రతి పదాన్ని చాలా లోతుగా అనుభవంలోకి తీసుకురండి. ఈ జ్ఞాన యోగం మిమల్ని  శక్తి, ఆనందం మరియు ప్రేమతో నింపుతుంది.
  4. రోజులో మీ ఆత్మిక స్వరూపంతో బుద్ధిని జోడించండి – మీరు ప్రతి భోజనం, పండ్లు, నీరు, రసం, టీ లేదా కాఫీ తాగే టపుడు మరియు ప్రతి గంటకు ఒకసారి, కొన్ని సెకన్ల పాటు మీ లోలోపలికి వెళ్లి, మీ మనసు , బుద్ధి మరియు సంస్కారాలతో ఆంతరికంగా యోగం చేయండి. ఈ మూడింటిలో శాంతి, పవిత్రత మరియు పాజిటివిటీను నింపుకొని కార్యంలోకి తీసుకొచ్చేందుకు మిమల్ని మీరు శక్తివంతం చేసుకోండి.
  5. భగవంతునితో సంభాషణ చేస్తూ మీ రోజును ముగించండి – రోజు చివరిలో, ఆ రోజులోని మీ ఆలోచనలు, మాటలు మరియు కర్మలన్నింటినీ ప్యాక్ చేసి భగవంతునితో లోతైన సంభాషణ చేయండి. ఆ రోజంతా జరిగిన ప్రతి విషయాన్ని అతనితో పంచుకోండి. భగవంతుని సలహా తీసుకొని మీ హృదయంలో వారి సుందరమైన వైబ్రేషన్స్ ను నింపుకొని నిద్రపోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »