ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై ఆధారపడి ఉంటుంది. ఇతరుల బలహీనతలను, వారి నెగెటివ్  ప్రవర్తనను చూసినప్పుడు మన హృదయాల్లో ద్వేషం కలుగుతుంది. కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తి నుండి ఏదైనా ఆశించి, మనకు కావలసినది లభించనప్పుడు, వ్యక్తిని నెగెటివ్ గా చూడటం మరియు ద్వేషించడం ప్రారంభిస్తాము. కొందరికి తమ జీవితాల్లో కొంతమందిని ద్వేషంచటం సర్వసాధారణం. మనం ద్వేషం నుండి పూర్తిగా విముక్తి పొందగలమా? ఇది సాధ్యమేనా? ద్వేషం నుండి విముక్తి పొందడానికి కొన్ని విభిన్న మార్గాలను చూద్దాం –

  1. భగవంతుని ప్రేమతో మీ హృదయాన్ని నింపుతూ మీ రోజును ప్రారంభించండి – మీరు ఉదయం లేచిన క్షణం, ప్రేమ సాగరుడైన భగవంతునితో సాన్నిహిత్యం గురించి ఆలోచనలు మరియు భావాలను సృష్టించుకోండి. వారి ఆశీర్వాదాలు తీసుకొని మెడిటేషన్ మరియు సైలెన్స్ తో వారితో కనెక్ట్ అవ్వండి. విశ్వంలో ఆత్మలందరూ పరమాత్ముని పిల్లలైన మీ ప్రియమైన సోదరీ-సోదరులపై ఆత్మిక ప్రేమ నిండుతుంది. వసుధైక కుటుంబకం అనే భావన కలుగుతుంది.
  2. మీరు ఒక మంచి ఆత్మ మరియు ఆత్మలందరూ మంచివారని లోతుగా భావించండి – మనల్ని మనం గాఢంగా ప్రేమించుకున్నప్పుడే మనం ఇతరులను ప్రేమించగలం. మనలో బలహీనతలు ఉన్నాయని గ్రహించినప్పుడే ఇతరులకు కూడా బలహీనతలు ఉంటాయని మనం గుర్తించగలం. మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నామని గ్రహించినపుడు మాత్రమే మనం ఇతరులపై సహనం కోల్పోకుండా ఇతరులు కూడా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహిస్తాము. అప్పుడు మనం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించము.
  3. ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు ఇవ్వడం నేర్చుకోండి – మనం రోజులో ఎవరిని కలిసినా, వారి ప్రత్యేకతల గురించి ఆలోచించండి. అవతలి వ్యక్తి గురించి నెగెటివ్ లేదా సాధారణమైన ఆలోచనలను మీ మనస్థితిని తాకనివ్వవద్దు. అందరి గురించి మంచిని చెప్పండి.
  4. మీరు ఎక్కడ ఉన్నా ప్రేమ యొక్క పాజిటివ్ వాతావరణాన్ని తయారుచేయండి – మనం ప్రేమ మరియు సన్నిహిత వాతావరణాన్ని తయారుచేసినప్పుడే, మనం పరస్పరం ప్రేమ మరియు ఆనందాన్ని పంచుకున్నప్పుడే మనం అన్ని గుణాల స్వరూపులుగా ఉండి ప్రతి ఒక్కరినీ వాటితో నింపుతాము. అలాగే, మనం ఇతరుల గుణాలను మాత్రమే గ్రహిస్తాము, వారి బలహీనతలను ఎన్నటికీ గ్రహించము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »