Hin

4th feb soul sustenance telugu

ప్రపంచంలో మార్పు రావాలి అని మనకు అనిపిస్తుందా?

ప్రతి రంగంలో అత్యుత్తమ విజయాన్ని ఈ ప్రపంచం చవిచూసింది. అనేక సౌకర్యాలు మరియు సానుకూల ప్రయోజనాలతో నిండిన జీవితాన్ని జీవించే అవకాశం ప్రస్తుత సమయం మనకు ఇస్తుంది. మొత్తంమీద, పెరిగిన సాంకేతికత కారణంగా మనం చాలా ఆధునిక యుగంలోకి ప్రవేశించామని మనం భావిస్తున్నాము. ప్రపంచం మునుపెన్నడూ లేని విధంగా అందంగా పెనవేసుకుంది. ప్రజలు వివిధ రకాల మీడియాల ద్వారా మరియు అనేక ఇతర మార్గాల ద్వారా దగ్గరవుతున్నప్పటికీ వారు ప్రేమ మరియు అవగాహనలో మాత్రం ఒకరికొకరు దూరమవుతున్నారనే ఆందోళన ప్రపంచంలో పెరుగుతోంది. అలాగే, కొన్ని సంవత్సరాల క్రితం అంతగా అందుబాటులో లేని వైద్యం ఇప్పుడు అద్భుతమైన వైద్య చికిత్సలతో మనిషికి ఇప్పుడు అందుతుంది. అయినాకానీ, శారీరక మరియు మానసిక వ్యాధులు పెరుగుతున్నాయి; అకాల మరణాలు, ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, రోగాల కారణంగా ఇంటి సభ్యుల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మనసు ఎక్కవ కావాలి అంటుంది, అది కూడా ఇప్పుడే కావాలి అంటుంది, ఎంత ఉన్నా మనసు తృప్తి చెందడం లేదు. అసలు ఇంత క్లిష్టంగా మనం ఎలా తయారయ్యామో మనకే అర్థం కావడం లేదు కదా! మన వ్యక్తిత్వంలో కోపం, అహం, దురాశ, అసూయ, ద్వేషం మరియు చింత నిండిపోతున్నాయి.
నేడు, ప్రజలు కొంత సంతోషంగా ఉన్నారు కానీ శాశ్వతంగా కాదు. వినోదం పొందడానికి మనిషి వద్ద ఈరోజు అనేక విషయాలు ఉన్నాయి, కానీ అదే సమయంలో, బాధ మరియు ఒత్తిడిని కలిగించే కారణాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. డబ్బు సంపాదించడం కొందరికి చాలా సులభమైతే విజయాన్ని సాధించనివారికి అది జీవితంలో అతి కష్టమైన అంశంగా మారి సంఘర్షణకు లోనవుతున్నారు. హెచ్చుతగ్గులు, మనుషుల మధ్య తారతమ్యాలు ఉన్న ఈ ప్రపంచంలో జీవించడమే గగనమైపోయింది కొందరికి. అందుకే, ఈరోజు, ప్రపంచం ఒక మంచి మార్పు కోసం ఎదురు చూస్తుంది. ఈ సమస్యలను కట్టడి చేసి పతనాన్ని ఆపే మంచి మార్పు కావాలి. భగవంతుడు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు మెడిటేషన్ అనే సాధనాల ద్వారా ఆత్మ ఉద్ధరణ జరిగి పరమాత్మతో ఆత్మకున్న సంబంధం పునఃస్థాపన అవుతుంది. ఈ మెడిటేషన్ ద్వారా ఆత్మ తన స్వ గుణాలైన శాంతి, ఆనందము, ప్రేమ, సంతోషము, పవిత్రత, సత్యత మరియు శక్తితో నింపుకుంటుంది. ఆత్మ స్వస్థతయే అన్ని రకాల సమస్యలకు, సామాజిక సమస్యలకు మరియు ప్రాపంచిక స్థితిగతులకు సరైన చికిత్స.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »
8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »