04 january - soul sustenance

నాలో ఉన్న శ్రేష్టతకు చేరుకోవడం (భాగం -3)

మన శ్రేష్టతకు చేరుకోవడానికి , మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి వైపు దృష్టిని పెట్టాలి . ఇతరుల నుండి ప్రేమ మరియు ఆనందాన్ని కోరడం కస్తూరి జింక వలె జీవించడం వంటిది. కస్తూరి జింక దాని నాభిలో సువాసనను కలిగి ఉన్నప్పటికీ సువాసన కోసం బయట వెతుకుతూ ఉంటుంది . అదే విధంగా మనలో ఆత్మిక ఖజానాలు అన్ని ఉన్నాయి. మనం మన సుగుణాల స్వరూపానికి తిరిగి చేరుకోవడం అంటే మనలో ఆత్మిక ఖజానాలు ఉన్నాయి అని పూర్తిగా గుర్తించాలి. ఈ ఖజానాలను భగవంతుని జ్ఞానము మరియు శక్తి ద్వారా నింపుకోవాలి. అనేక జన్మలుగా ఈ ఖజానాలు ఎంతగా క్షీణించాయో అంతగా మనం మన సంతోషాన్ని కోల్పోయాము. అదే విధంగా చెడు సంస్కారాలు లేదా స్వభావ-సంస్కారాలతో మనకు మనం భారంగా మారాము. మనం కాలచక్రంలో అనేక జన్మలుగా ఈ స్వభావాలతో చేసిన తప్పుడు కర్మల ఫలంగా ఇవి మన సహజ గుణాలుగా మారిపోయాయి.
కాబట్టి ఇప్పుడు, ప్రస్తుత సమయం యొక్క పిలుపు — విశ్వంలోని ప్రతి ఆత్మ ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్మునితో బుద్ధిని జోడించడం.పరమాత్ముడు విశ్వంలోని ప్రతి ఆత్మకు తల్లి , తండ్రి. వారి ద్వారానే అన్ని సుగుణాలు తిరిగి మనలో నిండుతాయి.వారితో మనం బుద్ధిని జోడించడం వలన మనం ఆంతరంగికంగా ఆధ్యాత్మికంగా సంపన్నంగా అవుతాము . మనం ఎంతగా పరమాత్మునితో బుద్ధిని జోడిస్తామో అంతగా మన మూల స్వరూపానికి చేరుకుంటాము ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం కంటే ఎంతో దూరంలో ఉన్నఆత్మల ప్రపంచం నుండి మనం ఇక్కడికి వచ్చాము. అంతేకాక ప్రస్తుత సమయం కేవలం స్వయాన్ని స్వచ్ఛంగా మరియు శుద్ధంగా మార్చుకోవడంతో పాటు కొద్ది కాలం ఆత్మలందరి ఇల్లు అయిన పరంధామానికి తిరిగి వెళ్లవలసిన సమయం ఇది. ఆ తరువాత, మనం జనన-మరణ చక్రంలోకి వస్తాము. పరంధామంలో ఉన్న కొద్ది సమయమే ఆత్మకు విశ్రాంతి సమయం. విశ్రాంతి తరువాత ఆత్మ తిరిగి ఈ కర్మక్షేత్రం, కార్యక్షేత్రంలోకి వస్తుంది . అంటే , మనందరమూ మన తిరుగు ప్రయాణంలో ఉన్నాము మరియు ఈ జనన-మరణ చక్రం పునరావృతం అవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »