4th july 2023 soul sustenence telugu

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే చింతను అధిగమించడం (పార్ట్ 1)

మన దైనందిన జీవితంలో మనమందరం మన కుటుంబంలో, మన కార్యాలయంలో మరియు మన సమాజంలో అనేక వ్యక్తులను చూస్తాము, వారందరూ మన గురించి భిన్నమైన అవగాహనలను మరియు అభిప్రాయాలను కలిగి ఉంటారు. వారు తమ మనస్సులో మన గురించి ఆలోచించే ఆలోచనలలో కొన్ని మంచివి ఉంటాయి కానీ కొన్ని మనం వినడానికి మరియు తెలుసుకోవటానికి ఇష్టపడని నెగెటివ్ గా ఉంటాయి.  ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఈ భయాన్ని మరియు ఆందోళనను ఎలా అధిగమించాలి? ఈ సందేశంలో అర్థం చేసుకుందాం –

  1. మీరు భగవంతునికి ప్రత్యేకమైన సంతానం మరియు శుద్ధమైన ఆత్మ అని ప్రతిరోజూ మీకు మీరు చెప్పుకోండి – ప్రతి ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే, మీ గురించి కొన్ని మంచి మరియు ఉన్నతమైన ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభించండి. మిమ్మల్ని మీరు సూక్ష్మంగా ప్రశంసించుకుంటూ, మీ ప్రత్యేకతలు మరియు విజయాల గురించి కూడా ఆలోచించండి. మీరు దీన్ని ఎంత ఎక్కువ చేస్తే, మీరు అందరి నుండి మరియు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే భావన నుండి అతీతంగా అయిపోతారు. మీరు అందరినీ గౌరవించడంతో పాటు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని గౌరవిస్తారు. తద్వారా ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో, ముఖ్యంగా వారు తప్పుగా ఆలోచిస్తుంటే మీరు దాని గురించి చింతించరు. అతీతంగా ఉన్న కారణంగా, వారు మీ బలహీనతలు లేదా మీ  యొక్క కొన్ని చర్యల గురించి ఏదైనా సరైనదని భావిస్తే, మీరు మెరుగుపడాలని మీరు భావించినట్లయితే, మీరు వారి అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చి మీలో ఆ మార్పులను తీసుకువస్తారు.
  2. అంతరంగంలోకి వెళ్ళి, మనన చింతన  చేయడానికి రోజులో కొద్ది సమయ విరామాలు తీసుకోండి – ఈ రోజుల్లో మానవ జీవితాల్లో చాలా సాధారణమైన అంశం బాహ్యంగా చూడటం మరియు రోజంతా వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం. చాలా మంది వ్యక్తులు ఆంతరికంగా మరియు భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి సమయాన్ని వెచ్చించరు. ఇది వారిని మానసికంగా బలహీనపరుస్తుంది కనుకనే ఇతరులు వారి గురించి మాట్లాడే, చర్చించే వాటి వలన వ్యక్తులు ప్రభావితమవుతారు. భగవంతుడు తనతో కనెక్ట్ అవ్వాలని మరియు ప్రేమతో వారిని గుర్తు చేసుకోవాలని చెప్తారు. మనం ఎంత ఎక్కువ కనెక్ట్ అయితే మనం చేసే ప్రతిదానికీ ఇతరులు మనల్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు, ప్రతి ఒక్కరూ తమ ప్రేమ, గౌరవం, మద్దతు మరియు సహకారాన్ని మనకు అందిస్తారు.  ఎందుకంటే భగవంతుడు ఈ వాసుధైక కుటుంబం అనే వృక్షానికి బీజము. మనం భగవంతుడిని ఎంతగా ప్రేమిస్తామో, గౌరవిస్తామో, ఆ వైబ్రేషన్ మొత్తం వృక్షానికి, వృక్షం యొక్క ప్రతి ఆకులో ప్రసరిస్తుంది, మరో మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి ఆత్మ మనకు అడుగడుగునా అదే అందచేస్తారు, మన కోసం పాజిటివ్ గా మరియు మంచిగా ఆలోచిస్తుంది. వారు కొన్నిసార్లు నెగిటివ్ గా ఆలోచిస్తే మనం, వారి ఆలోచనలను మన పాజిటివ్ వైబ్రేషన్స్ తో మారుస్తాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »