Soul sustenance telugu 4th march 2023

విజయానికి 8 శక్తులు (భాగం 6)

నిన్నటి సందేశంలో, నిర్దిష్ట పరిస్థితిలో అష్టశక్తులలో కొంత శక్తిని ఉపయోగించేందుకు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించడంలో ఎలా కీలకమో మేము వివరించాము. ఈ సందేశం యొక్క ఈ చివరి భాగంలో, ఒక నిర్దిష్ట పరిస్థితిలో విజయాన్ని పొందడానికి జ్ఞానం మాత్రమే సరిపోదు కాబట్టి మనల్ని మనం ఆధ్యాత్మిక శక్తితో ఎలా నింపుకుంటామో వివరిస్తాము. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం అసంపూర్ణంగా ఉంటుంది మరియు పదునైన అంచు లేని గొడ్డలిలా ఉంటుంది. 

 

ఆత్మలో ఆధ్యాత్మిక శక్తి చాలా కాలంగా నిండి ఉంది. ఆత్మలో ఆధ్యాత్మిక శక్తి కొరకు మెడిటేషన్ యొక్క సాధన అవసరం. ఎందుకంటే జనన మరణ చక్రంలో చాలా శక్తులను కోల్పోయిన తర్వాత ఆత్మ తనను తాను శక్తివంతం చేసుకునే ఏకైక మార్గం మెడిటేషన్ మాత్రమే . బ్రహ్మ కుమారీల వద్ద బోధించబడే మెడిటేషన్ ఆలోచన శక్తిని ఉపయోగించి మనస్సును మరియు విజువలైజేషన్ శక్తిని ఉపయోగించి బుద్ధిని భగవంతునితో అనుసంధానించే విధానం . భగవంతుడు ఆధ్యాత్మిక శక్తికి అత్యున్నత మూలం. మెడిటేషన్ లో, మనం మనస్సులో ఆధ్యాత్మిక ఆలోచనలను సృష్టించడం మరియు బుద్ధిలో ఆధ్యాత్మిక చిత్రాలను సృష్టించడం వంటి చిన్న అడుగులు వేస్తాము. దాని ఫలితంగా, కొన్ని నిమిషాల్లో మనం చేతన మనసు యొక్క ఉన్నత దశ అయిన ఆత్మానుభూతి,  ఆ తరువాత  పరమాత్మానుభూతిని పొందుతాము. వాస్తవానికి, పరమాత్మ యొక్క అనుభూతి పొందాక భగవంతునితో లోతైన అనుబంధం మరియు ఐక్యత యొక్క అనుభవంలో ఉండాలి. ఈ కనెక్షన్లో, భగవంతుని శక్తి ఆత్మలోకి ప్రవేశించి ఆత్మ మరింత శక్తివంతం అవుతుంది. ఇలా ఈ శక్తిని తీసుకోవడం లేదా కొంత సమయం పాటు ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడం సహజంగా ఆత్మను ఎనిమిది శక్తులతో నింపుతుంది. అష్ట శక్తులు అంటే సహన శక్తి, ఇముడ్చుకునే  శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ  శక్తి. మెడిటేషన్ లో మనం సర్వశక్తివంతునితో కనెక్ట్ అవ్వడానికి ఆత్మ యొక్క మనస్సు మరియు బుద్ధిని ఉపయోగిస్తాము అని గమనించడం ముఖ్యం. తత్ఫలితంగా, ఆత్మ యొక్క సంస్కారాలలో ఆధ్యాత్మిక శక్తి నిండుతుంది. ఈ విధముగా, మనము అష్టశక్తులతో నిండిన మాస్టర్ సర్వశక్తిమంతుడు లేదా ఆ భగవంతుని యొక్క శక్తిశాలి ఆత్మిక  బిడ్డగా  అవుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »