నేను ప్రయత్నిస్తాను అని కాదు నేను తప్పకుండా చేస్తాను అని అనండి

నేను ప్రయత్నిస్తాను అని కాదు నేను తప్పకుండా చేస్తాను అని అనండి

ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను చేస్తాను బదులుగా నేను ప్రయత్నిస్తాను అని అంటాము. ప్రయత్నించడం వేరు,  చేయడం వేరు. ప్రయత్నం అనే పదం మనస్సు, శరీరం మరియు విశ్వానికి సందేహాస్పద శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది సాధారణ ప్రయత్నాలు చేయడానికి, విఫలమవ్వడానికి మరియు ఫలితం కోసం బాధ్యతను తిరస్కరించడానికి అనుమతిస్తుంది. ఇలా ఆరంభంలోనే ఓటమిని అంగీకరించినట్లవుతుంది. మీరు మీ అలవాటులో మార్పు గురించి అయినా లేదా పనిలో కొత్త ప్రాజెక్ట్ గురించి అయినా చెప్పాలనుకున్నప్పుడు, నన్ను ప్రయత్నించనివ్వండి అని చెప్పి మీరు మీ సామర్థ్యాన్ని తెలియజేస్తారా? ప్రయత్నిస్తాను అనే పదం మీ ప్రయత్నాలపై సూక్ష్మమైన అడ్డంకి  ఉంచడాన్ని  మరియు ఇప్పటికే ఫలితాన్ని నెగెటివ్ గా ప్రభావితం చేయడాన్ని మీరు గ్రహించారా? ప్రయత్నిస్తాను  మరియు చేస్తాను అనే రెండు పదాల యొక్క శక్తి పూర్తిగా భిన్న స్థాయిలో ఉంటుంది.  ప్రయత్నం అనేది తక్కువ-శక్తి పదం, ఇది విజయాన్ని నెమ్మదిస్తుంది లేదా వైఫల్యానికి  అవకాశం ఇస్తుంది. ఇది మన ఉత్తమమైనదాన్ని ఇవ్వనివ్వదు. నేను చేస్తాను అని నమ్మకంగా చెపుతూ ప్రతి పనిని బలమైన పునాదితో  ప్రారంభిద్దాం. నేను చేస్తాను అనే పదానికి ఉన్న అత్యధిక వైబ్రేషన్ మనకు వరం అవుతుంది. ఇది విశ్వానికి అదే సందేశాన్ని పంపి విజయాన్ని ఆకర్షిస్తుంది. మన పదజాలం నుండి ప్రయత్నిస్తాను అనే పదం తొలగిద్దాం. మన ఆలోచనలు మరియు మాటలు ప్రారంభం లోనే శక్తివంతంగా పాజిటివ్ గా ఉన్నప్పుడు, మన దృఢ నిశ్చయం మనల్ని ప్రతి పనిని ఖచ్చితంగా చేసేలా చేస్తుంది.

 

మీరు శక్తివంతమైన జీవి అని ప్రతిరోజూ అనేక సార్లు గుర్తు చేసుకోండి. మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారో అది చేయండి. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని  వాటిని ఎలా సాధిస్తారో నిర్ధారించుకోండి. మీరు వాటిపై పని చేస్తున్నప్పుడు మీ ఉత్తమమైన వాటిని ఇవ్వండి. బలమైన సంకల్ప శక్తితో మీ లక్ష్యాలకు మద్దతు ఇవ్వండి. ఆలోచించి,  నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేయండి. వాయిదా వేయకండి, నన్ను ప్రయత్నించనివ్వండి అని ఎప్పుడూ అనకండి. మీ లక్ష్యాలు మరియు ఉద్దేశ్యం గురించి ఖచ్చితంగా ఉండి,  సందేహం లేదా భయం యొక్క అంశం లేకుండా చూసుకోండి. కేవలం కోరిక మాత్రమే కాదు ఎల్లప్పుడూ నమ్మకంతో ఉండండి. కేవలం ప్రయత్నించడమే కాకుండా కార్య రూపంలో పెట్టండి.  కేవలం ఆశించడమే కాదు బాధ్యత వహించండి. జీవితంలోని అన్ని రంగాలలో కేవలం ప్రయత్నించడమే కాక ఎల్లప్పుడూ సాధించండి. మీరు కార్యాన్ని ప్రారంభించే ముందే మీ ఆంతరిక సంభాషణలు పాజిటివ్ గా ఉన్నాయని నిర్ధారించుకొని  విజయం కోసం మీ మనస్సును ప్రోగ్రామ్ చేయండి. నేను చేయగలను…ఇది చాలా సులభం…నేను చేస్తాను వంటి అధిక-శక్తి పదాలను మాత్రమే ఉపయోగించండి. మీరు మీ వైబ్రేషన్స్  పెంచినప్పుడు, భయం మరియు సందేహాలు తొలగిపోయి మీ పాజిటివిటీ పరిస్థితులకు ప్రసరిస్తుంది మరియు అనుకూలమైన సంఘటనలు, వ్యక్తులను ఆకర్షించి మిమ్మల్ని విజయవంతం చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »