Hin

10th sep 2024 soul sustenance telugu

September 10, 2024

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన జీవన నాణ్యతకు దోహదం చేస్తాయి. మనం ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు, మనం ఎక్కువగా శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతాము. మన శరీరం ఫిట్‌గా ఉందా లేదా, చురుకైనదా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం త్వరగా గమనిస్తాము. ఆధ్యాత్మిక, మానసిక, భావోద్వేగ మరియు సామాజిక ఆరోగ్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంది. సంతృప్తికరమైన జీవితానికి మనం అన్ని అంశాలను పెంపొందించుకోవాలి.

  1. భావోద్వేగ, మానసిక, సామాజిక మరియు శారీరక స్వస్థతకు ఆధ్యాత్మిక ఆరోగ్యం ఆధారం. భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి, వారి శక్తులతో మిమ్మల్ని మీరు నింపుకోవడానికి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. జీవించడానికి నైతిక విలువలు మరియు ఆదర్శాల దిక్సూచిని సృష్టించండి.
  2. శారీరక ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయండి. సరైన ఆహార పానీయాలు మరియు నిద్ర అలవాట్ల యొక్క జీవనశైలిని పద్దతిగా అనుసరించండి.
  3. భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యం సరైన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలోకి వచ్చి మీ విధిని సృష్టిస్తాయి. వ్యక్తులు మరియు పరిస్థితులు సరిగ్గా లేకపోయినా వాటి గురించి మంచినే ఆలోచించండి. స్వచమైన మనస్సు మీ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసరింపజేస్తుంది, అయితే తప్పుడు ఆలోచన అనారోగ్యంగా మారుతుంది.
  4. సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఇతరుల నుండి ఏదైనా కోరుకోవడం మానేయండి. ఎలాంటి ఆపేక్షలు లేకుండా మీ స్వంత సామర్థ్యం ప్రకారం ఇవ్వండి. ప్రేమ, నమ్మకం, గౌరవం, ఆనందాలను ప్రసరించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »