5th april soul sustenance telugu

ఏమీ ఆశించకుండా, షరతులు పెట్టకుండా ఇతరులను ప్రేమించండి

మనమంతా పరస్పరంలో ఎంతో ప్రేమగా ఉండాలనుకుంటాము. ప్రేమ మన స్వాభావిక స్వభావము, మన సహజ స్థితి. అయితే మనం ఎవరి గురించైనా నెగిటివ్ ఎమోషన్‌ను ఉత్పన్నం చేసినప్పుడు, మన ప్రేమ ఆగిపోతుంది, మన బంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రేమ అంటే, ఎవరు ఎలా ఉన్నారో అలా వారిని అంగీకరించడం, వారి క్షేమాన్ని కోరుకోవడం, వారు మనతో ఎలా ప్రవర్తించినా కానీ వారిని గౌరవించడం. బేషరతు ప్రేమను అందించడం అన్నది ఎప్పటికీ మన ఎంపిక, ఇతరులతో దీనికి సంబంధం లేదు. మీలో ఉన్న ప్రేమ శక్తితో మీరు కనెక్ట్ అయి ఉంటే, ఆ ప్రేమను మీరు ప్రతి దృశ్యంలో, ప్రతి చర్యలో అనుభూతి చెందుతారు.

  1. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో, అంతగానే మనం ఇతరులనూ ప్రేమించాలి అని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు నేర్పిస్తుంది ఎందుకంటే మనమంతా ప్రేమ స్వరూపులమే. మరి మీరు అటువంటి ప్రేమను అందిస్తున్నారా? లేక వ్యక్తినిబట్టి, సౌకర్యాన్ని బట్టి, మీ మూడ్‌ను బట్టి అది మారుతూ ఉంటుందా?
  2. ప్రేమ మన వద్దకు సహజంగానే వస్తుంది. మనం మన కుటుంబాన్ని మరియు స్నేహితులను బేషరుతుగా ప్రేమిస్తాము అని చెప్తుంటాము. కానీ, తీర్పు, విమర్శ, భయం, గాయం, కోపం, పోల్చుకోవడం, పోటీతత్వము లేక ఇతరులనుండి ఆశించినప్పుడల్లా,  మన ప్రేమను తరచూ తెలిసో తెలియకో ఇవ్వకుండా ఆపేస్తుంటాము.
  3. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే వారిని బేషరతుగా ప్రేమిస్తున్నాము అని అర్థం. ఆశించడాలు ఉండవు, వారి మాటలు లేక ప్రవర్తన బాగా లేనప్పుడు కూడా మనం ఏమీ ఆశించము. మన ప్రేమ శక్తిని వృధా పోనివ్వకుండా ఇతరులకు పంపుదాము, ఎందుకంటే మన ప్రేమ వారికి ఉపశమనాన్ని ఇస్తుంది, వారిని పరివర్తన చేస్తుంది.
  4. ప్రతి బంధానికి పునాదిని బలంగా, ప్రేమ శక్తితో నింపండి, ఇది కాలాన్నిబట్టి, వ్యక్తులు, పరిస్థితులను బట్టి మారదు. ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోండి – నేను ప్రేమ స్వరూప ఆత్మను. బేషరతు ప్రేమను ఇవ్వడం నా సహజ సంస్కారము. నా ప్రేమ భావాలు ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి లేవు. నేను బేషరుతుగా ప్రేమించడాన్ని ఎంచుకుంటున్నాను, అందరికీ సంతోషాన్ని ఇస్తాను. నేను ఇతరులకు ప్రేమ మూలాన్ని.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »