భగవంతునితో నమ్మకమైన సంబంధానికి 5 సులువైన అడుగులు

భగవంతునితో నమ్మకమైన సంబంధానికి 5 సులువైన అడుగులు

  1. భగవంతుడు మన సుప్రీం తల్లి-తండ్రి, సంరక్షకుడని గ్రహించండి – మన జీవితంలో జరిగే ప్రతి పాజిటివ్ లేదా నెగెటివ్ భగవంతుడు నిర్ణయించినందున జరుగలేదని  మనం చాలా లోతుగా గ్రహించాలి. గత జన్మల మరియు ఈ జన్మలో మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యల ఫలితంగా ఇది జరుగుతోంది. నా జీవితంలో జరిగే ప్రతిదానికీ భగవంతుడు బాధ్యుడు కాదు, కానీ నా జీవితంలో జరిగే ప్రతిదానిలో నాకు సహాయం చేయడానికి వారు బాధ్యుడు.
  2. దృఢ నిశ్చయంతో ఒక అడుగు వేస్తే భగవంతుడు వెయ్యి అడుగుల సహాయాన్ని అందిస్తారు  – మీరు మీ జీవితంలో అత్యంత కఠిన దశలో ఉన్నా, అదే సమయంలో అనేక నెగెటివ్ సంఘటనలు జరుగుతున్నా, మీరు ఆశ కోల్పోకుండా దృఢ నిశ్చయంతో ఉండాలనే భగవంతుని సూచనను గుర్తుంచుకోండి. అప్పుడు భగవంతుడు మీరు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు సహాయం చేస్తానని,  మీ ప్రతి సమస్యను సరైన సమయానికి సరైన విధంగా పరిష్కరిస్తారని చేసిన  వాగ్దానాన్ని గుర్తుంచుకుంటారు. 
  3. భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ వారిని స్మరించుకోండి – ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే, కొన్ని నిమిషాలు భగవంతుడిని స్మరిస్తూ వారి నుండి ప్రేమ, ఆశీర్వాదాలు మరియు శక్తిని పొందండి. ఆ రోజంతటి గురించి, మీరు ఎదుర్కొనే సవాళ్ల గురించి చెప్పి శక్తివంతంగా ప్రారంభించండి. రోజులో, ప్రతి ముఖ్యమైన చర్యలో భగవంతుడిని మీతో ఉంచుకొని నిరంతరం వారితో మాట్లాడండి. రాత్రి, నిద్రపోయే ముందు, రోజంతా సహాయం చేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్తూ కొంత సమయం వారిని గుర్తుచేసుకోండి. పూర్తి విశ్వాసంతో వారి ఒడిలో నిద్రపోయి ఆ విశ్వాసాన్ని మరుసటి రోజుకి తీసుకువెళ్లండి.
  4. సుఖ-దుఃఖాలలో భగవంతుడిని తోడుగా చేసుకోండి  – దుఃఖ సమయాల్లో మనం చాలాసార్లు భగవంతుడిని స్మరిస్తాం కానీ సంతోష సమయాల్లో, మనం వారిని మరచిపోతాము. మళ్ళి భగవంతుని పై చాలా ప్రేమ ఉందని చెబుతాము. కానీ మనం నిజంగా భగవంతుడిని ప్రేమిస్తే, సుఖ-దుఃఖాలు రెండింటిలోనూ వారిని మనతో ఉంచుకోవాలి. మనం ఎంత ఎక్కువ వారిని ప్రేమిస్తే, అంత మనల్ని వారు తిరిగి ప్రేమిస్తారు. వారు ఎల్లప్పుడూ మనతో ఉన్నారని మనం ఎంతగా భావిస్తామో అంత వారిని  ఎక్కువగా విశ్వసిస్తాము.
  5. సత్కర్మలు చేస్తూ భగవంతుని  సహాయాన్ని పొందండి – మీ ప్రతి ఆలోచన, మాట మరియు చర్యను చెక్ చేసుకొని భగవంతుడు మరియు మీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే అన్ని సద్గుణాలతో వాటిని నింపండి. ఇది మిమ్మల్ని భగవంతునికి సమీపంగా చేరుస్తుంది,  జీవితంలోని అన్ని రంగాలలో వారు మిమ్మల్ని నిరంతరం రక్షిస్తారు. అప్పుడు భగవంతుడు మీ కోసం లేరని మీరు ఎప్పటికీ భావించరు. జీవితం ఆనందంగా మారి మీరు వారిపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »