5th feb soul sustenance telugu

సుగుణాలను ఉపయోగించమని పిల్లలను ప్రోత్సహించండి, ప్రశంసించండి

పిల్లలు సుగుణాలను ఉపయోగించినప్పుడు, వారి పనులలో, ఆలోచనలలో, మాటలలో చూపించినప్పుడు వారిని మనం ప్రశంసించాలి. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఒక్కో గుణము, విలువ ఉంటాయి, వాటిని గుర్తించాలి, పెంచాలి మనం. జీవితంలో విలువలు, సుగుణాలు అన్నిటికన్నా గొప్పవి, ముఖ్యమైనవి అని నేర్పించండి.

    1. పిల్లలు సుగుణాలను చెబితే నేర్చుకోవడం కన్నా చూసి త్వరగా నేర్చుకుంటారు. పెద్దవారిగా మీరు సుగుణాలను నిలకడగా పాటిస్తే పిల్లలు అది చూసి గ్రహిస్తారు. చిన్న చిన్న పనులలో నిజాయితీని చూపించండి, ఉదాహరణకు, తప్పును ఒప్పుకోవడం, పన్ను కట్టడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు జరిమానా కట్టడం వంటివి. కుటుంబ సభ్యులను, స్నేహితులను, పొరుగువారిని, సహోద్యోగులను గౌరవించండి, ఇదంతా పిల్లలు గమనిస్తూ ఉంటారు.
    2. ప్రతిరోజూ మెడిటేషన్ చేయమని పిల్లలకు నేర్పించండి. అలాగే, రోజును ప్రారంభించే ముందు ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఒక చిన్న పేజీ చదవమని చెప్పండి. ఇది పిల్లలను ప్రశాంతంగా ఉండేలా చేసి ఎమోషన్లలో శక్తిశాలిగా ఉండేలా చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుని విలువలపై నిలబడతారు పిల్లలు.
    3. చదువు మరియు ఇతర విషయాలలో దేనికెంత విలువ ఇవ్వాలో ప్రాధాన్యతను ఇవ్వడం నేర్పించండి. స్నేహితులతో కలిసి క్లాసును ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాము అని మీకు చెబితే, ముందుగా, వారు నిజాయితీగా చేసింది చెప్పినందుకు వారిని అభినందించండి, తర్వాత వారి చేసింది తప్పు అని వివరించండి.
      4. పిల్లలు తమ జీవిత దిక్సూచిని తామే తయారు చేసుకునేలా వారికి సహాయపడండి. ఏదైనా ఒక విలువను ఎంచుకుని, దానిని ప్రతిచోట, ప్రతి ఒక్కరి వద్ద, ప్రతిసారీ ఒక వారంపాటు ఉపయోగించి చూడమని చెప్పండి. సుగుణాలను ఉపయోగిస్తుంటే ఎలా అనిపిస్తుందో, ఏ ఏ లాభాలు కలుగుతున్నాయో గమనించమని చెప్పండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »
21st march soul sustenance telugu

21st March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 2) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలు: ఆంతరిక మౌనము మరియు ఏకాగ్రతా శక్తి –

Read More »