Hin

05th january - soul sustenance

జీవితంలోని ప్రతి సన్నివేశంలో సహనంగా ఉండటం

ఎప్పుడైతే స్పీడ్‌, హడావిడి అనేవి మన జీవన విధానంగా మారాయో , అప్పటి నుండి మనం అసహనానికి గురవుతున్నాం. సహనం ఫలిస్తుంది మరియు అసహనం మనల్ని చాలా నష్టపరుస్తుంది అని వివేకం చెబుతుంది. కానీ కొన్నిసార్లు మనం ఏదైనా త్వరగా చేయాలనుకున్నప్పుడు, త్వరితగతిన మార్పులు కోరుకున్నప్పుడు, సవాలు ఉన్నప్పుడు లేదా అనిశ్చితిని భరించలేనప్పుడు, మనం అసహనానికి గురవుతాము. మనకు కావలసినది కావాలి, వెంటనే కావాలి అని అంటాము .

1. మీలో సహన శక్తి, సర్దుకునే శక్తి మరియు మీ చుట్టూ ఉన్న దాదాపు ప్రతిదీ స్వీకరించే శక్తి ఉంది. అందువలన ఎప్పుడూ – నేను వేచి ఉండలేను…నేను తట్టుకోలేను…. అని అనవద్దు. చిన్న చిన్న విషయాలలో సహనం కోల్పోవటం వలన మీ వ్యక్తిత్వంలో అసహనం ఒక భాగం అయిపోతుంది. సహనం మీకు కష్టాలు మరియు సమస్యలను పరిష్కరించే శక్తిని ఇస్తుంది, ఎందుకంటే సమస్యలు పరిష్కరిస్తున్నపుడు మీరు అసహనాన్ని సృష్టించి మీ ఆధ్యాత్మిక శక్తిని తగ్గించలేదు కనుక .

2. సహనం మీ నిజ స్వభావం. ఇది రాయల్టీ(హూందాతనం), గౌరవం మరియు ఆంతరిక శక్తికి సంకేతం. ప్రతి ఉదయం ధ్యానం చేసి మిమ్మల్ని మీరు శాంతితో నింపుకోండి. శాంతి వెంట సహనం సహజంగా ఉంటుంది. పిల్లలు తప్పుగా ప్రవర్తించినా, ట్రాఫిక్ జామ్ అయినా, ఇంటర్నెట్ నెమ్మదించినా, తోటి ఉద్యోగులు ఆలస్యంగా వచ్చినా లేదా చేయాల్సిన పని సమయానికి చెయ్యకపోయినా – సహనంతో మరియు ఓపికతో ఉండండి. అలా చేస్తే మీ ఆలోచనలను మీ నియంత్రణలోకి వస్తాయి.

3. మీ పట్ల, ఇతర వ్యక్తుల పట్ల మరియు పరిస్థితుల పట్ల కూడా ఓపికగా ఉండండి. ఎవరైనా నిదానంగా ఉండవచ్చు, ఎవరైనా తప్పులు చేయవచ్చు, కానీ అందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. గౌరవంగా వారికి సలహా ఇవ్వండి లేదా ఆదేశించండి. మీ సరళ స్వభావం ఇతరులకు ఇంకా ముందుకు వెళ్లేందుకు సహాయపడుతుంది . అలాగే, మన సహనం యొక్క వైబ్రేషన్స్ నిరంతరం స్వీకరించినప్పుడు అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు వేగంగా పరిష్కరించబడతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »