Hin

5th july 2023 soul sustenence telugu

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే చింతను అధిగమించడం (పార్ట్ 2)

  1. పాజిటివ్ ఆలోచనలు మరియు పాజిటివ్ భాగ్యాన్ని తయారుచేయడంపై దృష్టి పెట్టండి – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క చాలా ముఖ్యమైన కోణం మీ పాజిటివ్ భాగ్యాన్ని రూపొందించుకోవడం, అంటే అన్ని రకాల అంతర్గత మరియు బాహ్య సాధనలతో నిండిన జీవితాన్ని తయారుచేసుకోవడం. మన ఆలోచనలను మంచి గుణాలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా వాటిని పాజిటివ్ గా, శక్తివంతంగా మార్చుకున్నప్పుడు మన భాగ్యం మారుతుంది. జీవితం యొక్క ప్రయోజనాన్ని  అర్థం చేసుకున్న ఆత్మ ఎల్లప్పుడూ తనపై దృష్టి పెడుతుంది మరియు రోజంతా ప్రతిదానిని భగవంతుని మార్గనిర్దేశం చేసే విధంగా చేయాలని విశ్వసిస్తుంది, తద్వారా ఈ ప్రయోజనం సాధించబడుతుంది. అటువంటి జ్ఞాన సంపన్న ఆత్మ ఇతరులు తన గురించి ఏమీ మాట్లాడుతున్నారో, వారు తమ గురించి ఏమీ ఆలోచిస్తున్నారనే దానిపై దృష్టి పెట్టరు ఎందుకంటే ఇది సమయం మరియు ఆలోచన శక్తిని వృధా చేయడంగా పరిగణిస్తారు.
  2. అందరినీ సంతృప్తి పరచండి మరియు భగవంతునికి మీ సంబంధాల భారాన్ని వదిలేయండి – జీవితంలో మనం మన పాజిటివ్ స్వభావం మరియు జీవనశైలి ద్వారా  సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్ట పరచడం మనకు చాలా ముఖ్యమైన అంశం. అదే సమయంలో, మనం సంభాషించే కొంతమంది వ్యక్తులు మనం ఆశించినంత సంతృప్తి చెందరని మనకు తెలుసు. దీనికి కారణం వారి సంస్కారాలు, ఆలోచనా విధానాలు మరియు కొన్నిసార్లు మనకు అనేక గుణాలు ఉన్నప్పటికీ మనకు వాటిలో పరిపూర్ణత లేకపోవడం. మనల్ని ఇష్టపడని మరియు మనల్ని గౌరవించని కొందరి ఆత్మలతో ఈ జన్మ లేదా కొన్ని గత జన్మలకు సంబంధించిన నెగెటివ్ కర్మల  ఖాతాలు ఉన్నందున ఇది జరుగుతుంది. ఈ సందర్భాలలో మన గురించి వారికి ఉన్న నెగెటివ్ మరియు అనవసరమైన ఆలోచనల భారాన్ని మనం భగవంతునికి వదిలేయాలి. భగవంతునిపై  మనం ఎంత ఎక్కువ వదిలేస్తే అంత ఎక్కువగా మనం పాజిటివ్ గా ఉంటాము మరియు వారిని సంతృప్తి పరచడంలో భగవంతుడు కూడా మనకు వివిధ మార్గాల్లో సహాయం చేస్తాడు. 
  3. ఇతరులకు సేవ చేయడంలో మరియు అందరి దీవెనలు తీసుకోవడంలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి – మీరు చాలా మంది వ్యక్తులతో సంభాషించేటప్పుడు సేవ చేయడంలో బిజీగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భగవంతుని జ్ఞానం, గుణాలు మరియు శక్తులు అవసరం. ఇతరులు మన గురించి మంచిగా ఆలోచించాలని ఆశించే బదులు, మన ఆలోచనలు, మాటలు, చర్యలు మరియు వైబ్రేషన్స్  ద్వారా మనం భగవంతుని నుండి గ్రహించిన వాటితో నిరంతరం వారికి సేవ చేయవచ్చు. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ ఇస్తున్నాము కనుక అందరి మనస్సుల్లో  మన గురించి ఏమి ఉందో అని మనం మరచిపోతాము. అందరినీ భగవంతుడు ఎలా నిష్పాక్షికంగా మరియు ప్రేమతో చూస్తారో అలా మనం చూస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »