Hin

కృతజ్ఞతా డైరీ రాయడం

కృతజ్ఞతా డైరీ రాయడం

మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాము. మనం భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతాము ఎందుకంటే వారిని స్మరణ ఈ విజయాల అనుభూతికి  మనకు  సహాయపడింది. విజయాలు జీవితంలోని మంచి విషయాలు, అవి చిన్న చిన్న మైలురాళ్ళు, ఇవి కొన్నిసార్లు వాటంతటవే  మరియు కొన్నిసార్లు కొంత ప్రయత్నంతో మనకు వస్తాయి. అవి భౌతిక మరియు భౌతికేతర విషయాలు కావచ్చు.  కృతజ్ఞతా డైరీ అనేది ఒక చిన్న డైరీ, దానిలో మనం ప్రతిరోజూ మన  జీవితంలో జరిగిన మంచిని  వ్రాయవచ్చు. నా జీవితంలో ఈరోజు నాకు ఆనందాన్ని ఇచ్చిన  3-5 విషయాలు  వ్రాయవచ్చు. అది భగవంతుడు నాకు బహుమతిగా ఇచ్చినవి కావచ్చు, నాకు దగ్గరగా ఉన్న వ్యక్తి నాకు ఇచ్చినవి కావచ్చు లేదా ప్రకృతి నాతో పంచుకున్నవి కావచ్చు.

అలాగే, నేను ఎప్పటికప్పుడు నా కృతజ్ఞతా డైరీని మళ్లీ చదవాలి, దాని పాత పేజీలను తిరగేయాలి , ఒక నెల క్రితం, ఒక సంవత్సరం క్రితం లేదా కొన్ని సంవత్సరాల క్రితం నేను వ్రాసినవి చదవాలి. ఎందుకంటే,మన  జీవితంలోని మనకున్న వాటి గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుని, దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటామో, మనకున్న దాని కోసం మనం సంతోషంగా ఉంటాం, లేని వాటి కోసం బాధపడము . జీవితం కొన్నిసార్లు మనకు కఠినమైన,  నెగెటివ్ పరిస్థితులను చూపిస్తుంది, కొన్నిసార్లు మనం నిరాశకు మరియు విచారానికి గురవుతాము, కానీ మన కృతజ్ఞతా డైరీ మనం ఎంత అదృష్టవంతులమో గుర్తు చేస్తుంది. మనందరికి ఎన్నో విషయాలు మనల్ని సంతోషించేలా , మన హృదయంలో లోతుగా అనుభూతి చెందేలా చేసాయి. జీవితం అందంగా ఉంది, ప్రతి వ్యక్తి అందంగా ఉన్నారు , ప్రతి పరిస్థితి, నెగెటివ్ గా ఉన్నప్పటికీ, దానిలో ఏదో మంచి దాగివుంది , ప్రతి క్షణం అందంగా ఉంటుంది మరియు వాస్తవానికి మనకు అత్యంత ప్రియమైన భగవంతుడు చాలా సుందరమైన వారు , ఎందుకంటే వారు మంచివారు, ఎల్లప్పుడూ మనపై శ్రద్ధ మరియు దయ కలిగిన వారని మనకు ఈ డైరీ గుర్తుచేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »
5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »