HI

Soul sustenance telugu 5th march 2023

మానసిక స్వేచ్ఛ పొందడానికి 5 మెట్లు

  1. అందమైన మరియు దివ్యాత్మగా మిమ్మల్ని మీరు అనుభూతి చేసుకోండి  – స్వేచ్ఛకు మొదటి మెట్టు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క దైవీ  గుణాలతో నిండిన ఆధ్యాత్మిక శక్తిగా మిమ్మల్ని మీరు అనుభూతి చేసుకోండి . మీరు ఈ అనుభవంలోకి ఎంత లోతుగా వెళితే, మీరు మరింత స్వేచ్ఛగా ఉంటారు. మీరు అన్ని గుణాలతో నిండి ఉన్నందున మీరు బయట ఏ గుణాలను ఎప్పుడూ వెతకరు.

 

  1. ప్రతి ఆలోచనలో, మాటలో మరియు కర్మలో జ్ఞానాన్ని ఉపయోగించండి  – మీరు చదివిన లేదా వినే పాజిటివ్ జ్ఞానం ఏదైనా – ఆ కంటెంట్ నుండి 2-3 పాయింట్లను తీసుకోండి ప్రతి పరిస్థితిలో, సంబంధాలలో మరియు మీ ప్రతి ఆలోచన,మాట  మరియు కర్మలో ఉపయోగించండి. ఇది మిమ్మల్ని దుఃఖం మరియు అశాంతి నుండి విముక్తి చేస్తుంది, ఇదే  నిజమైన స్వేచ్ఛ.

 

  1. భగవంతుడుని మీ అత్యంత అందమైన సహచరుడిగా చేసుకోండి – భగవంతునితో కనెక్ట్ అవ్వండి, అతనితో సంభాషణ చేస్తూ రోజంతా అతని ప్రేమను పొందండి. భగవంతుని ప్రేమతో మిమ్మల్ని మీరు నింపుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో ఎవరితోనైనా మరియు దేనితోనైనా మీ మోహం తొలగిపోతుంది. అప్పుడు, మీరు అన్ని శక్తులతో నిండి, మీరు మీ అన్ని ఇంద్రియాలను సరిగ్గా నియంత్రిస్తారు, తద్వారా పూర్తి ఆంతరిక స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. 

 

  1. ప్రతి డిపెండెన్సీని చెక్ చేసుకొని వాటిని దాటి వెళ్లండి – మొబైల్, ఇంటర్నెట్, టెలివిజన్, టీ, ఆల్కహాల్, ధూమపానం, నిర్దిష్ట రకాల ఆహారం, షాపింగ్ మరియు మరెన్నో డిపెండెన్సీలు మన ప్రాథమిక జాబితాలో ఉంటాయి. పాజిటివ్ మరియు స్వచ్ఛమైన మనస్సు వీటన్నింటిని చెక్ చేసుకొని వాటిని దాటి వెళ్ళడం మొదలు పెడుతుంది . ఎందుకంటే అప్పుడే మనస్సు నిజంగా స్వేచ్ఛను పొందుతుంది. 

 

  1. మీ గుణాలు మరియు శక్తులను ఇతరులతో పంచుకోండి – మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ వైబ్రేషన్స్, మాటలు మరియు కర్మల ద్వారా మీ గుణాలను మరియు శక్తులను వారితో పంచుకోండి. మీరు దాతగా అయినప్పుడు, మీరు పరిస్థితులు మరియు వ్యక్తులు మీకు అనుగుణంగా ఉండాలని ఆశించడం మానేస్తారు మరియు మీరు చేసే దేనికీ ఆమోదం పొందాలనుకోరు . మీరు ఇతరులతో పోల్చుకోరు మరియు ఇతరులు మీ గురించి అనుకునేవి , మాట్లాడే వాటి ప్రభావం నుండి కూడా మీరు విముక్తి పొందుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »
16th april 2024 soul sustenance telugu

ప్యూర్ బైట్స్ – స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు

మీరు ఏమిటో మీరు తీసుకునే ఆహారమే చెప్తుంది – అని చెప్పబడింది. అంటే మీరు తినే ఆహారం యొక్క శక్తి మీ మనస్సు మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన ఆహారం కోసం 5

Read More »
15th april 2024 soul sustenance telugu

సులభంగా అంగీకరించండి మరియు అపేక్షలకు దూరంగా ఉండండి

అంగీకరించే కళ ప్రశాంతంగా ఉండి జీవితంతో సాగిపోయే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది తేలికగా జీవించడానికి సహాయపడుతుంది. ఈ కళ అంచనాలు, ఆందోళనలు మరియు ఆపేక్షల నుండి మనల్ని విముక్తి చేస్తూ మన ప్రయాణాన్ని తేలికగా

Read More »