త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం వల్ల కలిగే
5 ప్రయోజనాలు

  1. మెంటల్ ఫ్రెష్‌నెస్ మరియు ఆంతరిక  శక్తిని అనుభూతి చెందడం – ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైన అంశం త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కోవడం. ఎన్ని గంటలు  నిద్రపోయామనేది మాత్రమే మనకు తాజా అనుభూతిని కలిగించదు, కానీ మీరు ఎప్పుడు నిద్రి పోతున్నారు మరియు ఎప్పుడు మేల్కొంటున్నారో కూడా మీ మనస్సుకు తేలికతనం మరియు శక్తి యొక్క ఉన్నతమైన అనుభూతిని ఇస్తుంది. ఇది కూడా ప్రకృతి నియమం, ఈ రోజుల్లో ఆధునిక మానవులు దీనిని విచ్ఛిన్నం చేస్తున్నారు మరియు రోజంతా మానసిక స్థితి తక్కువగా ఉండటమే కాకుండా, చిరాకు పడుతూ త్వరగా అలసిపోతున్నారు.
  2. మెడిటేషన్లో భగవంతునితో సులభంగా కనెక్ట్ అవ్వడం – రోజులో మీ ఆలోచనలు, మాటలు మరియు కర్మలను సర్దుకున్న తర్వాత త్వరగా నిద్రపోవడం మనస్సును శక్తివంతం చేసి మనస్సును నిశ్శబ్దం మరియు స్థిరత్వంతో నింపుతుంది. అలాంటి వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి, నిశ్చయత మరియు తేలికతో భగవంతుని స్మరణతో రోజును ప్రారంభిస్తాడు మరియు తమ చేతనంలో భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం  మరియు శక్తిని పొందుతాడు.
  3. తెల్లవారుజాము యొక్క స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ను అనుభూతి చెందడం  – సూర్యోదయానికి ముందు ఉదయం, మానవులు తమ స్వచ్ఛమైన చేతనంలో ఉంటారు మరియు ప్రతిచోటా అందమైన వైబ్రేషన్స్  ఉంటాయి. అలాగే, ప్రకృతి చాలా తాజాగా మరియు శాంతి మరియు స్వచ్ఛతతో నిండి ఉంటుంది. అలాంటి సమయంలో, రాత్రి మంచిగా  నిద్రపోయిన తర్వాత మనం త్వరగా మేల్కొన్నప్పుడు, మన చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతాం  మరియు మన చుట్టూ ఉన్న పర్యావరణం యొక్క స్వచ్ఛతను గ్రహించి ఉన్నతమైన అనుభూతిని పొందుతాము.
  4. మంచి శారీరక ఆరోగ్యం మరియు మెదడు బలాన్ని అనుభూతి చెందడం – సాధారణంగా త్వరగా నిద్రపోయి, త్వరగా మేల్కొని  మరియు సరైన సమయం వరకు నిద్రపోయే వ్యక్తులలో మెరుగైన శారీరక ఆరోగ్యం ఉంటుంది మరియు అన్ని శరీర అవయవాలు మెరుగ్గా  పనిచేస్తాయి. అలాగే, వారు మెరుగైన మెదడు ఆరోగ్యాన్ని మరియు మెదడుతో పాజిటివ్ గా పనిచేసే చురుకైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఆరోగ్యమైన శరీరం ద్వారా జీవితంలోని వివిధ రంగాలలో మరింత విజయాన్ని చూస్తారు.
  5. కలలు లేకుండా మరియు ఉన్నతమైన చేతనంతో నిద్రపోవడం – ఆధ్యాత్మికత యొక్క చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, మీ ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి మరియు ఎలాంటి కలలు లేకుండా మీ నిద్ర ఎంత బాగుంది, దీనిని ప్రశాంతమైన నిద్ర అని అంటారు. ఆలస్యంగా నిద్రపోవడం మనస్సును  మరియు శరీరం  యొక్క పని తీరుని డిస్టర్బ్ చేస్తుంది. దాని ద్వారా ఆత్మ యొక్క ఉన్నతి  కూడా నెగెటివ్ గా ప్రభావితమవుతుంది. దీని కారణంగా నిద్రలో ఎక్కువ కలలు వస్తాయి.  నెగెటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు రోజులో చాలా సాధారణం అయిపోతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »