Hin

2nd oct 2023 soul sustenance telugu

October 2, 2023

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే, సదా తమతో తాము సంతృప్తిగా ఉండేవారు, పాజిటివ్ శక్తిని ప్రసరింపజేసి, వారి జీవితంలో పాజిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తారని మనం గ్రహించాలి.

నేను ఇతరులతో సంతృప్తిగా ఉన్నానా – మన పాత్రలను అభినయిస్తున్నప్పుడు, బాధ్యతలు మరియు సంబంధాలను నిర్వర్తిస్తున్నప్పుడు, విభిన్న సంస్కారాలు కలిగిన విభిన్న వ్యక్తులు మనకు పరిచయం అవుతుంటారు. నేను ప్రతి ఒక్కరితో సంతృప్తి చెందానా లేదా నేను ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారా అని ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి. అలా చేస్తే ప్రతి సంబంధాన్ని అందంగా మార్చుకోవడం నాకు శక్తిని ఇచ్చి నన్ను తేలికగా చేస్తుంది.

ఇతరులు నాతో తృప్తిగా ఉన్నారా – ఇతరులతో సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనది అయితే, ఇతరులు నాతో సంతృప్తిగా ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోవాలి. నా సంస్కారాలలో నేను ఎంత అందంగా మరియు పరిపూర్ణంగా ఉన్నాను మరియు ఇతరుల పట్ల ఎంత మంచిగా మరియు పాజిటివ్ గా ఆలోచిస్తానో, అంతగా ఇతరులు నా దగ్గరికి వస్తారు మరియు వారి నుండి నేను సంతృప్తి సర్టిఫికెట్ ను పొందుతాను.

నేను భగవంతునితో తృప్తిగా ఉన్నానా – ఆధ్యాత్మికత మనకు భగవంతునితో ఒక అందమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్ని బోధిస్తుంది, అది లేకుండా మన జీవితాలు అసంపూర్ణంగా మరియు సఫలీకృతం కాకుండా ఉంటాయి. ఒక ఆత్మిక తండ్రిగా భగవంతుడు మనకు పాలనను ఇస్తారు, ఆత్మిక శిక్షకుడుగా భగవంతుడు మనకు  జ్ఞానాన్ని పంచుతున్నారు  మరియు ఆత్మిక గురువుగా వారితో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పిస్తారు. వారి నుండి ఈ ప్రాప్తులను పొందుతున్నప్పుడు, నేను అడుగడుగునా వారితో సంతృప్తి చెందుతున్నానా అని చెక్ చేసుకోవాలి.

భగవంతుడు నాతో తృప్తిగా ఉన్నారా – భగవంతుడు మనలో వివిధ గుణాలు మరియు శక్తులతో నింపి మనలను సుందరమైన వారిగా చేస్తారు. నేను ఎల్లప్పుడూ భగవంతుని సూచనలను అనుసరించి, వారికి ఆజ్ఞను ఉల్లఘించనప్పుడు, నేను వారి నుండి సంతృప్తి సర్టిఫికెట్ ను పొందుతాను. వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలతో నిండిపోతాను.

నేను నా జీవితంతో సంతృప్తిగా ఉన్నానా – ఈ జన్మ మరియు మన పూర్వ జన్మల కర్మల ఆధారంగా మన జీవిత పరిస్థితులన్నింటికీ మనం సృష్టి కర్తలము. ఇది నా జీవితంలో నాకు సంతృప్తిని కలిగిస్తుంది మరియు నేను ప్రతి పరిస్థితిని అంగీకరిస్తాను.  వర్తమానంలో అందమైన మరియు పాజిటివ్ చర్యలను చేయడం ద్వారా నా కోసం పాజిటివ్ భవిష్యత్తును సృష్టించుకుంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 1)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మ పాత్ర (పార్ట్ 1)

మానవ ఆత్మ ఒక సూక్ష్మమైన (భౌతికం కాని) స్టేజి. నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు, చిత్రాల సూక్ష్మ పాత్ర నిరంతరం దానిపై జరుగుతుంది. మన ఆలోచనలు 4

Read More »
కార్యాలయంలో నిజాయితీ

కార్యాలయంలో నిజాయితీ

మీ కార్యాలయంలో నిజాయితీ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, విజయం మరియు సంతుష్టతలకు రహస్యం కూడా. నిజాయితీని విలువైనదిగా భావించే ఉద్యోగికి విజయం, నమ్మకం లభిస్తాయి. మన నిజాయితీ విషయంలో రాజీ

Read More »
మీ దినచర్యలో సమయపాలన అలవాట్లను అలవర్చుకోవడం

మీ దినచర్యలో సమయపాలన అలవాట్లను అలవర్చుకోవడం

తరచుగా ఆలస్యంగా వచ్చే వ్యక్తి, ఆలస్యానికి కారణంగా నెమ్మదిగా ఉన్న ట్రాఫిక్ ను లేదా కారు వైఫల్యాన్ని నిందిస్తూ ఉంటాడని మనందరికీ తెలుసు. సమయపాలన అనేది జీవితకాలపు అలవాటుగా ఉండాలని మనకు తెలుసు, ఎందుకంటే

Read More »