HI

6th april soul sustenance telugu

మీ రోజువారీ దినచర్యలో సమయపాలన అలవాట్లను పెంపొందించుకోవడం

ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవారిని మనం తరచూ చూస్తుంటాము, వారి ఆలస్యానికి ట్రాఫిక్ జామ్ లేక కారు పాడయింది అంటూ ఉంటారు. సమయ పాలన అంటే, మనందరికీ తెలిసివట్లు, ఒక జీవితకాల అలవాటుగా ఉండాలి. ఎందుకంటే సమయాన్ని దుర్వినియోగం చేయడం అనైతికం. అయినాకానీ, మనలో కొంతమందికి దాని గురించి సాధారణ వైఖరి ఉంటుంది. సమయపాలన అంటే మనం సమయానికి హాజరవ్వడమే కాదు, ఇతరుల సమయాన్ని కూడా గౌరవించడం. ఎప్పుడైనా ఎవరైనా మీ సమయానికి గౌరవమివ్వలేదా? మీటింగులకు ఆలస్యంగా రావడము, గడువులను అనుసరించకుండా పనికిరాని సంభాషణలోకి మిమ్మల్ని లాగుతున్నారా? మరింత ముఖ్యమైనది, అప్పుడప్పుడు ఆగి మీరు ఎంత చక్కగా సమయాన్ని గౌరవిస్తున్నారో పరిశీలించుకుంటున్నారా? కాలం ఎప్పుడూ మనకు సహాయం చేస్తూ మనతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటాము. ఇతరులతో ఉన్నట్లుగా, సమయంతో కూడా ప్రేమ మరియు గౌరవ భావాలతో నిండిన అనుబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇక ఆ తర్వాత, మనకు మరిన్ని విజయాలు కావాలన్నా, మెరుగైన బంధాలు, మెరుగైన ఆరోగ్యం, లాభాదాయకమైన అలవాట్లు అన్నిటికీ కాలం కలిసొస్తుంది. సమయం ఒక శక్తి, ప్రతి క్షణము ఇక్కడ ముఖ్యము. రోజులోని మొదటి 30 నిమిషాలను మన మనస్సును ఉత్తేజపరిచేందుకు ఉపయోగించుకుందాం. ఆ తర్వాత మనం చేసే పనులలో సరైన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు తప్ప మరింకేవీ ఉండవు. సమయపాలన అంటే, అనవసరమైన పనులలో సమయాన్ని వృధా చేయకుండా ఉండటము, చేయాల్సిన పనులకు గౌరవాన్ని ఇవ్వడము, ఇతరుల సమయాన్ని గౌరవించడము ముఖ్యము. 

ఈరోజు నుండి మీ అన్ని పనులలో సమయ పాలనతో ఉండండి. ప్రతి చోట సమయానికి ఉండేలా చూసుకోండి లేదా సమయంకన్నా ముందే ఉండండి. సమయపాలన మీకు సహజంగా రానివ్వండి. మీ రోజును ఉదయాన్నే ప్రారంభించండి, మీ రోజు ఎలా గడవాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి, మీ దినచర్యను ఖచ్చితంగా పాటించండి. అన్ని పనులకు నిర్థారిత సమయాన్ని కేటాయించండి, చేయాల్సిన పనులన్నిటికీ సమయాన్ని ఇవ్వండి. ఆలస్యం చేయకండి, చివరి నిమిషం వరకు ఆగకండి. వెంటనే చేసేయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే, 15 నిమిషాలు అదనంగా పెట్టుకోండి, అనుకోని ఆలస్యాలు రావచ్చు కాబట్టి దీనిని ఉద్దేశంలో పెట్టుకుని సమయానికి లేక సమయంకంటే ముందే చేరుకునేలా చూసుకోండి. అది ఎంత సాధారణమైన సందర్భమైనా కానీ, సమయాన్ని పాటించాలి అన్న నియమాన్ని విడిచిపెట్టకండి. ప్రతి పనికి మీ పూర్తి శ్రద్ధను ఇవ్వండి. స్పష్టంగా ఆలోచించుకునేందుకు సమయాన్ని ఇవ్వండి, సరైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి. మీ సమయపాలన మిమ్మల్ని నమ్మకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు సమయ పాలన చేయకపోయినా కానీ మీ అలవాటును మీరు మార్చుకోకండి. మీ ప్రణాళికలు మరియు ఉత్తమ ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఆలస్యం జరిగితే, ముందుగానే వారికి తెలియజేయండి, ఇది రిపీట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. ఆలస్యం అయితే కలిగే అవిశ్రాంతతనానికి  దూరంగా ఉంటూ, మంచి పేరుతో, ఒత్తిడి లేని జీవితాన్ని గడపగలుగుతారు. గుర్తుంచుకోండి, మనం సమయానికి విలువను ఇస్తే సమయం మనకు విలువ ఇవ్వడం మొదలుపెడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 3)

విజయానికి మార్గం ప్రధాన మార్పులతో నిండి ఉంటుంది, దానిలో ప్రయాణీకులుగా మనం స్వీకరించగలగాలి మరియు మార్పులు మనలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా ఎదుర్కోగలగాలి. ఆత్మిక బలం లేకపోవడం, మార్పులను ప్రతికూలంగా చూసే ధోరణి కారణంగా

Read More »
18th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను

Read More »
17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »